Home » రాజకీయాల్లోకి విజయ్.. పార్టీ పేరు ప్రకటన..!

రాజకీయాల్లోకి విజయ్.. పార్టీ పేరు ప్రకటన..!

by Anji
Ad

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రీ కళగం అనే పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా విజయ్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు విజయ్. పార్టీ జెండా అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. అవినీతిని నిర్మూలిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు విజయ్. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం అన్నారు.   రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు అని తెలిపారు.  సినిమాలకు నటుడు విజయ్ తాత్కాలిక విరామం. లోకేష్ కనగరాజ్ తో తీసే సినిమానే చివరిది.

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత అంతటి స్టార్ ఇమేజ్ కలిగి ఉన్న నటుడు విజయ్ దళపతి.  విజయ్ ని అభిమానులు దళపతి అని ము*ద్దుగా పిలుచుకుంటారు.  వాస్తవానికి గత కొద్ది రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయము తెలిసిందే.  పార్టీ పేరు ఇదే అంటూ పలు సోషల్ మీడియా ఛానల్ లో  చాలా రకాల వార్తలు ప్రచురితమయ్యాయి . వాటిని నిజం చేస్తూ విజయ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ రాజకీయ ఎంట్రీ దేశ, తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరీ.

 

 

Visitors Are Also Reading