విదురుడు మహా మేధావి. తెలివిగల వాడు. ముందు కాలజ్ఞానంలో ఏం జరుగుతుందో చెప్పగలిగే మహానుభావుడు. అదేవిదంగా ఏది మంచి, ఏది చెడు అనే కొన్ని విషయాలను కూడా విదుర స్పష్టంగా తెలియజేశారు. విదుర చాలా గొప్ప వివేకవంతుడు నీతిమంతుడు. అతని ఆలోచన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడం వల్లనే ఆయన హస్తినాపురంనకు మంత్రిగా పని చేశారు. ఈయన హస్తినకు మహారాజు, దృతరాష్ట్రుడి సంక్షోభంలో ఉన్నప్పుడు గొప్ప మంత్రిగా విధురుడిని సూచనలు అందుకొని రాజ్యాన్ని పాలించేవాడు. విదురుడి నీతి ప్రకారం.. కొందరూ జీవించే విధానంలో వారి సుఖ, సంతోషాలను అడ్డుకునే ఈ మూడు విషయాల గురించి విదుర కొన్ని విషయాలను తెలిపాడు. వెంటనే ఆ మూడు విషయాలను వదిలేయండి.
విదురుడు, ధృతరాష్ట్ర మధ్య జరిగిన కొన్ని చర్చల సమాహారాన్ని విదిర్ నీతి అంటారు. మహాత్మ విదుర గురించి తెలియజేసిన ఈ విషయాలను అతని కాలంలోనే ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇప్పటికాలంలో ఆ విషయాలు సరిగ్గా సూట్ అవుతాయి. మన జీవన విధానంలో కొన్ని సంతోషాలను నాశనం చేసే ఈ మూడింటిని గురించి విదుర నీతిలో తెలియజేశాడు.
Advertisement
Advertisement
దురాశ : దురాశ కలిగిన వ్యక్తి ఆ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు. అందుకోసం అత్యాశను వదిలేయాలి.
కామం : విధుర నీతి ప్రకారం.. మనిషికి అధికారం ఏ వ్యక్తినైనా వినాశనం ఎదురవుతుంది. ప్రతి మనిషి వారిలోని కొన్ని కోరికలను కంట్రోల్ లో ఉంచుకోవాలి. కామ భావన ఒక మనిషిని మానసికంగా, శారీరకంగా బలహీనుడిగా మార్చుతుంది.
కోపం : కోపం అనేది ఒక మనిషి జ్ఞానానికి, మనస్సాక్షి ఈ రెండింటిని పాడు చేస్తుంది. కోపం అనేది ఏ మనిషికైనా ఆలోచించే మనసుని అర్థం చేసుకునే బలాన్ని బలహీనంగా మార్చుతుంది. ఇలాంటి కోపం కారణంగా న్యాయాన్ని నిర్ణయించే స్థోమతను నెమ్మదిగా కోల్పోతాడు. పలుమార్లు కోపంలో పొరపాట్లు కూడా జరిగిపోతుంటాయి. కోపం కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే విదురుడు కోపాన్ని వినాశనానికి మూలంగా భావించాడు. కోపాన్ని వెంటనే విడిచిపెట్టాలి. విదుర చెప్పిన ఈ మూడింటింని వదిలేసినట్టయితే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.
Also Read :
Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలు పాటిస్తే మీకు తిరుగుండదు..!