Vidudhala movie Review: తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. ఆయన ‘ఆడుకాలం’ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయన తీసిన చిత్రాలకు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ధనుష్ హీరోగా ఆయన తీసిన ‘అసురన్’ ను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేశారు. తమిళ హాస్యనటుడు సూరి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన సినిమా ‘విడుదల పార్ట్ 1’ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళంలో మార్చి 31న విడుదలైంది. తెలుగులో ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా రివ్యూ చూసేద్దాం.
READ ALSO : ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేసిన పని..ఏంటంటే ?
Advertisement
కథ మరియు వివరణ:
కుమరేషన్ (సూరి) కొత్తగా ఉద్యోగంలో చేరిన పోలీస్ కానిస్టేబుల్. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అయితే అక్కడ పోలీసులకి, ప్రజాధళం సభ్యులకు ఎన్కౌంటర్లు, ఒకరి మీద మరొకరు పై చేయిగా ఉండడానికి ఏమి చేయాలనే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పేరిట అక్కడ ఫ్యాక్టరీలు కట్టిస్తామని చెబుతూ పోలీస్ క్యాంప్ లనే నడుపుతూ ప్రైవేట్ కంపెనీ వారితో కలిసి క్యాంప్ ని నిర్వహిస్తుంది.
Advertisement
READ ALSO : మరణించిన తర్వాత “సౌందర్య” గారిని ఎలా గుర్తు పెట్టారో తెలుసా ? వింటూనే కన్నీళ్లు ఆగవు !
అక్కడ ప్రజాదళం నాయకుడైన పేరుమాల్ (విజయ్ సేతుపతి) ని పట్టుకునేందుకు పనిచేస్తున్న ప్రత్యేకమైన పోలీస్ దళానికి ఒకరోజు జీపులో ఆహారం సరాఫరా చేయడమే కుమరేషన్ పని. ప్రజలకి కష్టం వస్తే ఆదుకోవడమే పోలీస్ విధి అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. అయితే కుమారేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? పేరుమాళ్ నీ పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలను చేపట్టారు? అటవీ ప్రాంతంలోని మహిళలపై పోలీసుల అరాచకాలు ఎలా సాగాయి? పోలీసుల అరాచకాలను అడ్డుకోవడానికి సూరి ఎలా ప్రయత్నించాడు? కుంభింగ్ లో పోలీసులకు చిక్కిన పెరుమాళ్ పరిస్థితి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
పతాక సన్నివేశాలు
నటీనటులు
కథ ప్రపంచం
మైనస్ పాయింట్స్ :
సాగదీత సన్నివేశాలు
సంఘర్షణలేని కథ
రేటింగ్ : 2.5/5
READ ALSO : నవీన్ చంద్ర భార్య ఇంత అందంగా ఉంటుందా… ఇదిగో ఫోటోలు!