Home » రాజకీయాలకు గుడ్ బై..సినిమాల్లోకి ఏపీ మంత్రి విడదల రజిని?

రాజకీయాలకు గుడ్ బై..సినిమాల్లోకి ఏపీ మంత్రి విడదల రజిని?

by Bunty
Ad

హీరోలు రాజకీయాల్లోకి వస్తే నిజజీవితంలో కూడా ప్రజల అభ్యున్నతికి పాటు పడతారని అభిమానులు విశ్వసిస్తారు. అలాగే రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానిస్తారు. చాలామంది నటీనటులు కూడా తమ అభిమానుల అండ చూసుకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అలాగే చాలామంది రాజకీయ నాయకులు సినిమాల్లోకి వచ్చారు. అలా సినిమాలకు, రాజకీయాలకు దగ్గర పోలిక ఉంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు.

Advertisement

ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత ఎంతోమంది సినీ తారలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు నిర్మించినవారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ బాటలోనే ఏపీకి చెందిన మంత్రి విడదల రజిని అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఫిలిం నగర్ లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్మించే తొలి సినిమాకు కథ సిద్ధమైందని, దర్శకుడు, కథానాయకుడు కూడా సిద్ధమయ్యారని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు.

Advertisement

రాజకీయ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి ఆర్టిస్టులుగా విజయవంతమైన వారు ఉన్నారు. అలాగే కొందరు రాజకీయ నాయకులు తెరవెనక ఉండి తెర ముందు వేరే వారితో నడిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడదల రజని అధికారికంగానే ప్రకటిస్తారా? ఇతరుల పేర్లేమైనా ప్రకటిస్తారా? అనే విషయం తెలి యాల్సి ఉంది. అలాగే రాజకీయాలకు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. ఫుల్ స్టాప్ పెడతారా ? లేక రెండు రంగాల్లోనూ కొనసాగుతారా ? త్వరలోనే అనేది తెలియనుంది.

read also : Amigos Movie : “అమిగోస్” సినిమా ప్లస్ పాయింట్స్ ఇవే…కళ్యాణ్ రామ్ చేసినట్టేనా?

Visitors Are Also Reading