Home » సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తలైవార్ 170 అప్డేట్..!

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తలైవార్ 170 అప్డేట్..!

by Anji
Ad

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న మోస్ట్‌ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి తలైవా 170 . జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌   దర్శకత్వం వహిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్స్  బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తలైవా 170 టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి Vettaiyan టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. బుక్‌ రీడింగ్‌ తర్వాత చేతిలో స్టిక్‌ పట్టుకొని.. స్టైలిష్‌ గాగుల్స్‌ పెట్టుకున్న రజినీకాంత్‌ విజువల్స్‌ అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ అందించడం ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి.

Advertisement

ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్‌.. అదే స్టైల్ మ్యానరిజాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు తలైవా. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలే సెట్స్‌లో నుంచి షూటింగ్‌ స్పాట్‌లో రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తలైవా 170 ముంబై షెడ్యూల్ పూర్తయినట్టు కొన్ని రోజుల క్రితం అప్‌డేట్ కూడా తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో గురు ఫేం రితికా సింగ్  ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Advertisement

ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. జైభీమ్‌ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్‌ సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు లెజెండరీ యాక్టర్లను ఎలాంటి పాత్రల్లో చూపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. తలైవార్ 170 సోషల్ మీడియాలో మాత్రం షేక్ అవుతుందనే చెప్పాలి.  తలైవా దీంతో పాటు ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తుండగా.. పొంగళ్‌ 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్‌ మరోవైపు స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading