Home » సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో వేణుస్వామిపై దారుణంగా ట్రోల్స్..!

సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో వేణుస్వామిపై దారుణంగా ట్రోల్స్..!

by Anji
Ad

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరుగుతుండటంతో చాలా మంది ఆయనను గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా సమంత  అక్కినేని నాగచైతన్య  విడాకులు వ్యవహారం సమయంలో ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారు మ్రోగిపోయింది. ఇక  అప్పటి నుంచి వేణుస్వామి చాలా ఫేమస్ అయ్యారు.

Advertisement

ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. ఒక్క సమంత  విషయంలో ఈయన చెప్పింది జరగడంతో మిగతా అన్ని విషయాల్లో జరుగుతుందని కొంతమంది నమ్ముతూ వచ్చారు. అయితే ఈ ఏడాదిలో వేణుస్వామి చెప్పింది ఏది జరగకపోవడంతో ప్రతిఒక్కరు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇండియా వరల్డ్ కప్ ఈ ఏడాది కొడుతోంది అని చెప్పుకొచ్చాడు. అది జరగలేదు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతాడు అని చెప్పుకొచ్చాడు అది కూడా జరిగింది లేదు. ఇక ఈ ఏడాది వేణుస్వామిని ట్రోల్ చేయడానికి, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే..? ఇటీవలే  కొన్నిరోజుల క్రితం ప్రభాస్ జాతకం ఈయన చెప్పడమే.

ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని, హిట్లు ఉండవని, ప్రభాస్ పనిపోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పెళ్లి యోగం కూడా లేదని కూడ చెప్పాడు. ఇక పెళ్లి గురించి ఏమో కానీ.. తాజాగా నేడు సలార్ సినిమా  హిట్ అవ్వడంతో వేణుస్వామిని ప్రభాస్  ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ప్రభాస్ కి కొన్నేళ్ల వరకు హిట్ పడదు.. అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పాడు వేణు స్వామి. ప్రభాస్ పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ చెప్పుకొస్తున్నారు రెబల్ స్టార్ అభిమానులు. మరికొందరూ అతడి మాటలు నమ్మకండి.. వాడు చెప్పేవన్నీ ఫేక్. ఇందుకు నిదర్శనం సలార్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు.  మరోవైపు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తరచూ వేణుస్వామి వద్దకు వెళ్తుంటారు. అందులో హీరోయిన్ రష్మిక కూడా ఉన్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading