Home » డిసెంబర్ 5న ఆ రాశిలోకి శుక్రుడు.. వారి దశ మారునుందా ?

డిసెంబర్ 5న ఆ రాశిలోకి శుక్రుడు.. వారి దశ మారునుందా ?

by Anji
Ad

ఈ ఏడాది డిసెంబర్ 05న శుక్రుడు తన రాశిని మార్చుకుని ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో 4 రాశుల వారికి శుక్ర సంచారం శుభఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు, సంపద, శ్రేయస్సును ప్రసాదించేవాడు. శుక్రుడు ప్రేమ, అందం, ఆకర్షణకు చిహ్నం. శుక్రుడు తన రాశిని మార్చినప్పుడు ఇతర గ్రహాలను కలిసినప్పుడు ప్రతి ఒక్కరి జన్మచార్ట్ ని ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ 5న శుక్రుడు తన రాశిని మార్చుకుని ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో 4 రాశుల వారికి శుక్ర సంచారం కలిగి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుని సంచారం కొన్ని రాశుల అదృష్టాన్ని మార్చనుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేషం :

Advertisement

ఈ రాశి వారికి చాలా అదృష్టం కలుగతుంది. ఏం చేసినా వారికి అదృష్టం వరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాల్లో ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. శుక్రుని అనుగ్రహంతో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం ఉంటుంది. 

వృశ్చికం :

Advertisement

శుక్రుని సంచారంతో ఈ రాశివారి జీవితాలలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. బట్టలు, నగలు కొనుగోలు చేయవచ్చు. ధనలాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశముంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ వృత్తి జీవితంలో కూడా విజయాన్ని పొందుతారు. 

సింహం :

సింహరాశి ప్రేమ జీవితానికి సంబంధించి శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కొత్త ఉద్యోగార్థుల అన్వేషణ ముగుస్తుంది. మీ అంచనాలు నిజం అవుతాయి. మీరు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పొందుతారు. 

కుంభం  :

శుక్రుడు తన రాశిని మార్చుకుని ధనస్సు రాశిలోకి ప్రవేశించడం ద్వారా కుంభరాశి వారికి శుభఫలితాలు కలుగుతాయి. ఒకటి కంటే ఎక్కువ మూాలాలు నుంచి ఆదాయం చేకూరుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ, మాధుర్యం పెరుగుతాయి. రుణ విముక్తి కలుగుతుంది. 

Also Read :  ఈ రెండు వస్తువుల వల్ల మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది.. డబ్బే డబ్బు.. !

Visitors Are Also Reading