కమెడియన్ వేణుమాధవ్ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వేణు మాధవ్ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆయన డైలాగ్ డెలివరీ రూటే సెపరేట్ గా ఉంటుంది. ఆయన కామెడీకి ఎవరైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఆయన పోషించిన పాత్రలు ఆయన భౌతికంగా లేకపోయినా మనతోనే ఉన్నట్లు భావించేలా చేస్తుంటాయి.
Advertisement
వేణుమాధవ్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆయనకు నటనపైనే కాకుండా దర్శకత్వం పై కూడా మంచి గ్రిప్ ఉంది. ఒక్కోసారి ఆయన తన సన్నివేశాలకు తానె డైరెక్ట్ చేసుకునేవారట. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “సై” సినిమాలో ఆయన క్యారక్టరైజషన్, చిత్రణ అన్నీ తానె డిజైన్ చేయించుకుని నటించారట. అలాగే, ఛత్రపతి సినిమాలో కూడా తన ట్రాక్ మొత్తానికి తానె దర్శకత్వం వహించారట. ఇక సంక్రాంతి సినిమాలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇలా చాలానే సినిమాల్లో ఆయన తన పాత్రకు తానె డైరెక్టర్ అయ్యారు.
Advertisement
ఇక ఆయన పూర్తి స్థాయి డైరెక్టర్ గా ఓ హీరోని పెట్టి సినిమా తీయాలని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు.. సునీల్ నే. సునీల్ కమెడియన్ గా సూపర్ హిట్ అయినా కూడా హీరో అవ్వాలని అనుకున్నారు. ఆ టైం లోనే “అందాల రాముడు” సినిమా వచ్చింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తరువాత కూడా సునీల్ కమెడియన్ గా కొనసాగారు. కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అలా వేణుమాధవ్ కూడా ఓ సినిమా తీయాలనుకుంటే.. సునీల్ ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని సర్దుబాటు చేశారట. కానీ, ఫైనాన్స్ చేసేవాళ్ళు ఆఖరి నిమిషంలో చేతులెత్తేయడంతో ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
మరిన్ని ముఖ్య వార్తలు:
అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్న సెలబ్రెటీలు వీళ్లే..!
ముత్యాల్లాంటి NTR చేతిరాత…ప్రింట్ కాదండోయ్!