Home » ఈమె లైఫ్ కూడా ఆ నటి లానే ఉంటుంది.. శ్రీలీల పై వేణు స్వామి సంచలన కామెంట్స్….!

ఈమె లైఫ్ కూడా ఆ నటి లానే ఉంటుంది.. శ్రీలీల పై వేణు స్వామి సంచలన కామెంట్స్….!

by Sravya
Ad

నటి శ్రీలీల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో శ్రీలీల దూసుకు వెళ్లి పోతోంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల చేతిలో దాదాపు పదికి పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఆరు నెలల్లో బాక్స్ ఆఫీస్ వద్ద శ్రీలీల సందడి చేయబోతోంది. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత నాగచైతన్య విడిపోతారని ఆయన చెప్పినప్పటి నుండి కూడా బాగా పాపులర్ అయిపోయారు. చాలామంది సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్తూ ఉంటారు. శ్రీలీల జాతకం గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

చాలా తక్కువ మందికి మాత్రమే శ్రీలీల లాంటి జాతకం ఉంటుందని, శ్రీ లీల జాతకం ప్రకారం ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుందని వేణు స్వామి చెప్పుకొచ్చారు. 2028వ సంవత్సరానికి నెంబర్ వన్ హీరోయిన్ గా శ్రీలీల మారుతుందని, మీనరాశి ఆమెది. ఆమెకి రాజ యోగం ఉందని వేణు స్వామి అన్నారు. నయనతార జాతకం కి ఈమె జాతకం కి చాలా దగ్గరగా ఉందని నయనతారలా ఈమె కూడా మంచి నటి అవుతుందని చెప్పారు వేణు స్వామి. ప్రస్తుతం వేణు స్వామి చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.

Also read:

Visitors Are Also Reading