ఏపీకి లో ఎన్నికల హడావిడి మొదలైంది ప్రధాన పార్టీలకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం పార్టీల నేతల్లో కొంచెం ఆందోళన కనబడుతోంది. కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని దానిమీద జ్యోతిష్యులు వేణు స్వామి అంచనాలు వెల్లడించారు.
Advertisement
ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది జగన్ని ఓడించడమే లక్ష్యంగా కూటమిలోని మూడు పార్టీలు కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి జగన్ తనకి రెండవసారి అధికారం పైన ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ వామపక్షాల కూటమి బరి లోకి దిగింది ఈ టైంలో సర్వే సంస్థలు ఏపీ ఎన్నికల ఫలితాలు మీద అంచనాలు బయటపెడుతున్నాయి.
Also read:
Advertisement
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందని అంశంలో గ్రహబలాలు ఆధారంగా అంచనాలని వెల్లడించారు ఇక వేణు స్వామి చెప్పిన విషయాల్లోకి వెళ్లిపోతే.. జగన్ రాశి, నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు వైసిపి ముఖ్య నేత విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. నెల్లూరు ఎంపీ స్థానం కోసం వైసిపి నుండి విజయసాయిరెడ్డి టిడిపి నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ పడిపోతున్నారు జాతకం ప్రకారం విజయసాయి రెడ్డికి 10% వరకు అడ్వాంటేజ్ ఉంటుందని తెలుస్తోంది.
Also read:
మంత్రులు ముగ్గురు పరిస్థితిని వేణు స్వామి చెప్పారు. మంత్రులు రోజా అంబటి రాయుడు గుడివాడ అమర్నాథ్ టఫ్ ఫైట్ ని ఎదుర్కోబోతున్నట్లు చెప్పారు. అయితే వాళ్ళు ఓడిపోతారా అనే దానికి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు బీఆర్ఎస్ నుండి తిరిగి టీఆర్ఎస్ పేరు మార్పు అవసరమని అన్నారు సీఎం రేవంత్ ఎన్నికల తర్వాత కొన్ని కీలక పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు. కేటీఆర్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు వేణు స్వామి. తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండు అంశాలు మినహా కొత్తగా చోటు చేసుకునే అవకాశం లేదని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!