Home » Inspector Rishi Amazon prime Webseries: థ్రిల్లర్ లవర్స్‌ కోసం అదిరే వెబ్ సిరీస్..!

Inspector Rishi Amazon prime Webseries: థ్రిల్లర్ లవర్స్‌ కోసం అదిరే వెబ్ సిరీస్..!

by Sravya
Ad

Inspector Rishi : ఈ రోజుల్లో చాలామంది థియేటర్లకి వెళ్లడం మానేశారు. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. మూవీస్, వెబ్ సిరీస్ లు కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఛానల్స్ సందడి చేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఓటీటీ లో థ్రిల్లర్ జోనర్స్ చాలా పాపులర్. ఈ సెగ్మెంట్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది ఇటీవల రిలీజైన ఒక వెబ్ సిరీస్ థ్రిల్లర్ లవర్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

Also read: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్ యొక్క వైఫ్స్!

Advertisement

హారర్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా వచ్చి హిట్ అందుకుంది. జేఎస్ నందిని దర్శకత్వంలో ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ వచ్చింది. నవీన్ చంద్ర, సునైనా ఎల్లా ప్రధాన పాత్రలు పోషించారు తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ తర్వాత తెలుగు హిందీ కన్నడ మలయాళం లో కూడా వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 29 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం పది ఎపిసోడ్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

Also read: బాల‌య్య స‌ర‌స‌న క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రూ చిన్నారులు ఇప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అనే విష‌యం మీకు తెలుసా..?

కోయంబత్తూర్ సమీపంలోని అడవిలో వరుసగా కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి వీటి వెనక వనరచి అనే రాక్షసి అదృష్ట శక్తి ఉందని స్థానికులైతే నమ్ముతారు. ఇవి ఎవరు చేస్తున్నారు కనిపెట్టడానికి ఇన్స్పెక్టర్ రిషి ని పోలీసులు పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ తిరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. చాలా థ్రిల్లింగ్ ఎంగేజింగ్ గా ఉంది స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయింది. ఇన్స్పెక్టర్ రిషి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని సిరీస్ మొత్తం బ్యాలెన్స్ గా చూపిస్తారు. థ్రిల్లర్ లవర్స్ కి అస్సలు బోర్ కట్టదు. స్లో నేరేషన్ వలన కొందరికి నచ్చకపోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading