మెగాస్టార్ కెరీర్ లో వచ్చిన బెస్ట్ సినిమాలలో గ్యాంగ్ లీడర్ ఒకటి. 1991లో విజయ బాపినీడ్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెంచింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి మ్యూజిక్ అందించడంతో ఈ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఎన్నో హైలెట్స్ తో ఈ సినిమా 1991 లో ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Advertisement
ఇదిలా ఉంటే ఈ సినిమా తరవాత అందరూ గ్యాంగ్ లీడర్ మూడ్ లో ఉంటే వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాతో వచ్చాడు. స్టార్ డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సారి వెంకటేష్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Advertisement
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చంటి అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా మీనా నటించింది. ముఖ్యమైన పాత్రలో నాజర్ నటించారు. ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. 1991లో విడుదలైన ఈ సినిమా ఏడు కోట్ల షేర్ వసూలు చేసిన చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను అధిగమించింది.
చంటి సినిమా ఏకంగా తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసింది. అంతేకాకుండా 1992లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను బీట్ చేస్తూ ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల షేర్ వసూలు చేసి అదే సంవత్సరం మరో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. ఘరానా మొగుడు సినిమాతో చిరంజీవి మాస్ ఇమేజ్ మరింత పెరిగింది.
Also Read: ఖుషి V/S నరసింహానాయుడు. ఏది పెద్ద హిట్!