Home » వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన మూవీ ఆరు భాషల్లో రీమేక్.. ఆ సినిమా ఏదో తెలుసా ?

వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన మూవీ ఆరు భాషల్లో రీమేక్.. ఆ సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాను వెంటనే రీమిక్ చేయడం అనేది ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయింది.  మన దగ్గర హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో తెరకెక్కించడం.. ఇతర భాషల నుంచి రిలీజ్ అయిన సినిమాలు మన దగ్గర రిమేక్ అవుతూ ఉంటాయి. మన తెలుగు సినిమా ఒకటి ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చెప్పుకోండి చూద్దాం.. మీకోసం ఓ హింట్ కూడా ఇస్తాను.  ఆ సినిమాలో హీరో వెంకటేష్, అలాగే హీరోయిన్ సౌందర్య. అది ఏ సినిమాలో చెప్పుకోండి చూద్దాం.

Advertisement

ఇది  చెప్పడం చాలా కష్టమే. ఎందుకంటే వెంకటేష్, సౌందర్య కలిసి చాలా సినిమాలలో  నటించి మెప్పించారు. ఇంతకు ఆరు భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్, సౌందర్య సినిమా ఏదో గుర్తించండి. వెంకటేష్, సౌందర్యలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ లో వీరిద్దరికీ ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా పవిత్ర బంధం. అయితే పవిత్ర బంధం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సౌందర్య నటన ప్రేక్షకులను ఫిదా చేసింది.

Advertisement

ఈ మూవీలో వెంకటేష్ కు తండ్రిగా గాన గాంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం నటించారు. ఇక ఈ సినిమా ఏకంగా ఆరు భాషల్లో విడుదల అయింది. తెలుగులో ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. నాన్న కోసం పెళ్లి చేసుకుంటాను.. కానీ ఓ కండిషన్ ఏంటంటే.. ఒక ఏడాది కలిసి కాపురం చేస్తాం.. నచ్చితే పెళ్లి చేసుకుంటాం. నచ్చకుంటే విడిపోతాం అనే కాన్సెప్ట్ మీద ఈ చిత్రం తెరకెక్కించారు సుబ్బయ్య.  ఈ చిత్రాన్ని ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, తమిళ్, బెంగాలీ వంటి భాషల్లో రీమేక్ అయింది. ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయింది. అన్ని భాషలో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో పవిత్ర బంధం సినిమాకు ఉత్తమ చిత్రం గా నంది అవార్డు కూడా లభించింది. అలాగే ఉత్తమ నటిగా సౌందర్యకు, ఉత్తమ సహాయనటుడిగా బాలసుబ్రహ్మణ్యం నంది అవార్డులు అందుకున్నారు. అప్పట్లో వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు

రేణుదేశాయ్ కామెంట్స్ పై అంబటి రియాక్షన్ ఎలా ఉందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్.. సినిమాలకు గుడ్ బై?

Visitors Are Also Reading