Home » నూడుల్స్ తో పకోడి ఇలా చేయండి.. రుచితో పాటు ఆరోగ్యకరం కూడా..!

నూడుల్స్ తో పకోడి ఇలా చేయండి.. రుచితో పాటు ఆరోగ్యకరం కూడా..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది రోటిన్ గా తినే టిపిన్, స్నాక్స్ కి కాస్త భిన్నంగా ఉండాలనుకుంటున్నారు. రోజు తినే ఆహార పదార్థాలతో బోర్ కొట్టి కొత్త రకాల కోసం ప్రయత్నం చేసేవారు నూడుల్స్ పకోడాను ట్రై చేస్తే కాస్త డిపరెంట్ గా ఉండవచ్చు. శీతాకాలంలో వేడి వేడి వెజ్ నూడిల్స్ పకోడీ తింటే ఆ అనుభూతే వేరబ్బా… సాధారణంగా రకరకాల పకోడీల గురించి తెలుసు కానీ నూడుల్స్ పకోడి అంటే కాస్త ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. దీనిని హెల్తీగా చేసుకోవడం కోసం రకరకాల కూరగాయలు కూడా వాడవచ్చు. మంచి టేస్టీతో పాటు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. మిల్లెట్, నూడుల్స్ తీసుకుంటే ఇంకా మంచిది. కరకరలాడే నూడుల్స్ పకోడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కావాల్సిన పదార్థాలు :

మిల్లెట్ నూడుల్స్ ½ ఫ్యాక్, తురిమిన క్యారెట్ 2, సన్నగా తురిమిన క్యాప్సికమ్ 1, క్యాబేజీ  అరకప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి 4, సన్నగా తరిగిన ఉల్లిపాయ 2, శనగ పిండి ½ కప్పు, సరిపడినంత ఉప్పు, డీప్ ప్రైకి సరిపడినంత నూనె. 

Also Read :  మీరు గోడ పక్కన ఫ్రిజ్ ఉంచారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

తయారు చేయు విధానం :

Advertisement

Veg Noodles Pakodi : Manam News

వెజ్ నూడిల్స్ పకోడీ తయారు చేయడానికీ తొలుత మిల్లెట్ నూడుల్స్ వండుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ వెలిగించి దానిపై మూత పెట్టాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నూడుల్స్ వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి, సగం ఉడికిన తరువాత నీటిని తీసేసి.. ఉడకుండా ఉండడానికి చల్లని నీటితో కడిగి పక్కనే పెట్టుకోవాలి. తరువాత పెద్ద గిన్నె తీసుకొని దానిలో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీతో పాటు శనగ పిండి, ఉప్పు, నూడుల్స్ మసాలా టేస్ట్ మేకర్ వేసి అన్నింటిని పొడిగా కలపాలి. ఇక ఆ తరువాత అదే గిన్నెలో ఉడికించిన నూడుల్స్ వేసి వాటి జిగటతో ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. మళ్లీ నీరు వేయకూడదు. నీళ్లు వేస్తే మరింత పలుచగా మారి పకోడీలు అంతగా టేస్ట్ ఉండవు. ఇక ఆ తరువాత పకోడీలను డీప్ ఫ్రై చేయడానికి నూనె వేడి చేయాలి. స్టవ్ మీడియంలో ఉంచి కలిపిన మిశ్రమాన్ని పకోడీలుగా నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి టిస్యూలు ఉపయోగించాలి. వీటిని టొమాటో సాస్ తో వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. 

Also Read :   శీతాకాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Visitors Are Also Reading