Veera Simha Reddy Movie : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా నేడు థియేటర్ లలో విడుదలైంది. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై గోపిచంద్ మలినేని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ మరియు మలయాల కుట్టి హనీరోస్ లు నటించారు. అంతే కాకుండా ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మిశరత్ కుమార్ నటించారు.
బాలయ్య చివరగా అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వీరసింహారెడ్డి సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అంతే కాకుండా సినిమాలో కొన్ని ప్లస్ లు ఉంటే కొన్ని మైనస్ లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…..వీరసింహారెడ్డిలో బాలయ్య వీరసింహారెడ్డి మరియు జై అనే పాత్రల్లో నటించాడు.
Advertisement
Advertisement
కాగా సినిమాలో వీరసింహారెడ్డి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ జై అనే పాత్ర మాత్రం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. అంతే కాకుండా సినిమాలో ఫస్టాఫ్ లో కథ పెద్దగా ఉండదు. దాంతో ప్రేక్షకులను ఫస్ట్ హాఫ్ కూడా నిరాశపరిచింది. సినిమా కథ రొటీన్ గా ఉండటమే ఈ చిత్రానికి అతిపెద్దమైనస్ అయ్యింది.
అయితే కథ పాతదే అయినప్పటికీ ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉన్నాయి. మరోవైపు సినిమాలో కామెడీ లేకపోవడం కూడా ఈ చిత్రానికి మైనస్ అనే చెప్పాలి. బాలయ్య లెజెండ్, సింహా సినిమాల్లో విలనిజం బలంగా ఉంటుంది. వీరసింహారెడ్డిలో బలమైన విలనిజం లేకపోవడం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ శృతి అయినప్పటికీ హనీరోజ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
ALSO READ : ‘వీరసింహారెడ్డి’ థియేటర్ వద్ద మేకపోతును బలిచ్చిన బాలయ్య అభిమానులు.. ఎక్కడంటే..?