Veera Simha Reddy Review in Telugu: బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తిరకేక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసనా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ మరో పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఇక ఒకసారి ఈ సినిమా రివ్యూ పరిశీలిద్దాం.
READ ALSO: జియో సంచలన నిర్ణయం… 11 భాషల్లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు…!
Veera Simha Reddy Story in Telugu: కథ మరియు వివరణ
వీరసింహారెడ్డి కథ టర్కీ ఇస్తాంబుల్ లో మొదలవుతుంది. జై (బాలయ్య), ఈశా (శృతిహాసన్) ల పరిచయం అక్కడే అవుతుంది. వాస్తవానికి ఈ సినిమా అన్నాచెల్లెళ్ల మధ్య వైరంతో సాగే కథ. వీరసింహారెడ్డి, భానుమతి ఇద్దరు ఒకే తండ్రి పిల్లలు. అయితే తల్లులు వేరు. అయినా వీరసింహారెడ్డికి చెల్లెలు అంటే ఎంతో అభిమానం. కానీ, ఆ చెల్లెలు మాత్రం ఈ అన్నయ్యను సదా ద్వేషిస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఆమె ప్రేమించిన వాడిని వీరసింహారెడ్డి చంపించాడని భానుమతి నమ్మకం. ఈ నేపథ్యంలో అన్నపై పగ సాధించడానికి భానుమతి ఆయనకు వైరి అయిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్ళాడుతుంది. అయినా చెల్లెలుకు ప్రతి సంవత్సరం పండుగ రోజుల్లో పంపవలసిన సారే, చీరే పంపుతూనే ఉంటాడు వీరసింహారెడ్డి. తర్వాత కొన్ని కారణాల వల్ల వీరసింహారెడ్డి విదేశాలకు వెళ్తాడు. రాయలసీమలో అందరూ దేవుడిగా భావించే వీర సింహారెడ్డిని ఇక్కడ మట్టు పెట్టడం కష్టమని భావించిన భానుమతి, విదేశాలలో అయితే తన పని సులువు అవుతుందని భావిస్తోంది. ఓ కథనం ప్రకారం వీర సింహరెడ్డిని విదేశాలలో ఉండగానే పొడిచేస్తారు. భానుమతి సైతం అతడిని కత్తితో పొడిచి తన కక్ష తీర్చుకున్నానని సంతోషిస్తుంది. భానుమతి అంతటితో పగ తీరినట్టేనా? వీరసింహారెడ్డి ప్రేమాభిమానాలను చెల్లెలు గుర్తించిందా? ఆ తర్వాత ఏమైంది? అన్న అంశాలతో మిగతా కథ సాగుతుంది.
Also Read: Veera Simha Reddy Movie Dialogues: వీరసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్
ఈ సినిమా నటీనటుల్లో బాలకృష్ణదే అగ్రతాంబూలం. ఫ్యాక్షనిజం నేపథ్యం ఉన్న కథల్లో నటించి అలరించడం ఆయనకు కొట్టిన పిండి. అదే తీరున వీరసింహారెడ్డిగా, ఆయన కొడుకుగా బాలకృష్ణ దీపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. వీర సింహారెడ్డి చెల్లెలు భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన బాని పలికించారు. శృతిహాసన్ గ్లామర్ తో పాటు అనువైన చోట తన నటనతో అలరించారు. హనీరోజ్ అభినయం తప్పకుండా జనాన్ని కట్టిపడేస్తుంది. దర్శకుడు మలినేని గోపీచంద్ తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశారు. గోపీచంద్ కథకు అనువుగా బుర్ర సాయి మాధవ్ పలికించిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.
Veera Simha Reddy Review : ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ యాక్టింగ్
గోపీచంద్ మలినేని దర్శకత్వం
తమన్ సంగీతం
మేకింగ్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
పాతగా అనిపించే కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 3/5
READ ALSO: రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !