Home » Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఖచ్చితంగా ధనవంతులవుతారట..!

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఖచ్చితంగా ధనవంతులవుతారట..!

by Bunty
Ad

వాస్తు నిపుణుల ప్రకారము ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో మనం వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. లేకపోతే చాలా అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో వాస్తు నియమాలను ఎక్కువ మంది పాటించరు. దానివల్ల అనేక ఇబ్బందులు, కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల మనకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇంట్లో మనం ఎలాంటి వస్తువులను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

# ఓంకారం

హిందూ శాస్త్రాల ప్రకారం ఇంట్లో ఓంకారాన్ని పెట్టి పూజించాలి. ఓంకారాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఎలాంటి నెగటివ్ ఎనర్జీలు మనదరికి చేరవని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కావున ఇంట్లో తప్పకుండా ఓంకారం సింబల్ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏదో ఒక చోట ఓంకారం సింబల్ ని పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

# పూర్ణకుంభం

ఇంట్లో కచ్చితంగా పూర్ణకుంభం ఉండాలి. పూర్ణకుంభం వలన ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని విశ్వసిస్తారు. దీనిని శుభకార్యాల్లో తప్పకుండా వాడతారు. పూర్ణకుంభాన్ని రాగి, ఇత్తడి, బంగారు లోహాలతో తయారుచేస్తారు. పూర్ణకుంభానికి ఎరుపు రంగు తాడును, మామిడి ఆకులను కట్టడం వలన చాలా మంచి జరుగుతుందట. ఇలా చేసి పూజించడం వలన ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

# నీటి తాబేలు

Advertisement

డబ్బు నిల్వ ఉండడం కోసం ఇంట్లో నీటి తాబేలు ఉంచడం వంటివి చేస్తుంటారు. ఒక ప్లేట్లో నీళ్లు పోసి అందులో తాబేలు విగ్రహాన్ని పెట్టినట్లయితే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అంతే కాకుండా ఇంట్లో వారికి ఆరోగ్యం, సుఖ సంతోషాలతో ఉంటారట. ఈ తాబేలును ఉంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ తాబేలు ఉత్తరం వైపు చూసేలా ప్రతిష్టించాలి. కొంతమంది ఇంట్లో తాబేలు పెట్టడం వలన మంచి జరుగుతుందని రెండు, మూడు తాబేళ్లను పెడతారు. అలా పెట్టడం మంచిది కాదట. కేవలం ఇంట్లో ఒక తాబేలు మాత్రమే ఉండాలట.

# గోల్డెన్ ఫిష్

ఇంట్లో చేప పిల్లలను పెంచడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చాలామంది ఇళ్లలో ఎక్వేరియంలో చేప పిల్లలను పెంచుతారు. వీటిలో గోల్డెన్ ఫిష్ ఉండడం వలన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను పోగొడుతుంది. చేప పిల్లలను పెంచడం వీలు కాకపోతే కనీసం చేప ఆకారంలో ఉండే చిన్న చిహ్నాలను ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిది.

# గాలి గంటలు

ఇంట్లో గాలి గంటలు పెట్టుకోవడం చాలా మంచిది. ఇంట్లో వచ్చే గాలికి అవి చేసే శబ్దం వలన ఆహ్లాదం కలుగుతుంది. వీటిని బాల్కనీ లేదా హాల్ లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

టాలీవుడ్ హీరోలకు భార్యలుగా ఇంతమంది రెడ్డి అమ్మాయిలా…!

అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?

Visitors Are Also Reading