Home » పెళ్లి తేదీ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.. అప్పుడేనా ?

పెళ్లి తేదీ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.. అప్పుడేనా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్నాడు. అయితే  ఇటీవలే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు వీరు ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్ారు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడూ అనే విషయం పై ఆసక్తి నెలకొంది.

Advertisement

 

ఇప్పటికే పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటూ.. పలు కథనాలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతుంది. ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూకి హాజరైన వరుణ్ తన పెళ్లి తేదీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.  “ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. ఈ ఏడాదిలోనే చేసుకుంటాను. మా అమ్మ ఇంకా తేదీ ఖరారు చేయలేదు. పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయం. అంతేకాదు. తేదీ ఓకే వేదిక ఎక్కడ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

Advertisement

తన తరువాత సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాను. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక సినిమాపై ప్లాన్ చేస్తాను. డెస్టినేషనా లేదా అనేది ఫ్యామిలీతో కలిసి డిసైడ్ చేస్తామని వెల్లడించాడు. లవ్ ప్రపోజ్పై ప్రశ్నించగా.. ముందు తానే ప్రపోజల్ పెట్టింది అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడూ అని ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న వరుణ్ తేదీ పెళ్లి అత్యంత త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గాండీవధారి అర్జున మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుణ్ తేజ్ కి జంటగా ఇందులో సాక్షి వైద్య నటించింది. ఘని వంటి ఫ్లాప్ మూవీ తరువాత  వచ్చే ఈ  మూవీ హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Kushi: ఖుషి సినిమాకు విజయ్ – సమంత రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?

భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..? అందుకోసమేనా ?

Visitors Are Also Reading