Home » చిరంజీవిని స్టార్ హీరోని చేసిన సినిమాల లిస్ట్.. ఏంటంటే..?

చిరంజీవిని స్టార్ హీరోని చేసిన సినిమాల లిస్ట్.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో హీరోగా ఎదిగారు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే ఆయనకు ఉండే గుణమే ఆయన్ను అంత ఎత్తుకు తీసుకెళ్లింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా, కోట్లాదిమంది అభిమానుల మెగాస్టార్ గా మారడానికి కారణమైన కొన్ని సినిమాల లిస్టు ఇప్పుడు చూద్దాం.. అయితే కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని అందరికీ తెలుసు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు వారి అంచనాలకు మించి విజయాన్ని అందుకున్నాయి.

Advertisement

also read:అన్న ఎన్టీఆర్ శ్రీదేవిని ఆ చిత్రంలో వద్దనడం వెనుక ఇంతటి రహస్యం ఉందా..?

Advertisement

చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ” పసివాడి ప్రాణం” చిత్రం బిగ్గెస్ట్ హిట్టు కావడమే కాకుండా ఆయన అభిమానులకు ఎంతగానో నచ్చింది. అంతేకాకుండా రవి రాజా పినిశెట్టి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన “యముడికి మొగుడు” సినిమా కూడా ఆయనకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత చిరంజీవి రామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ “అత్తకు యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం అభిమానులకు ఎంతగానో దగ్గరయింది. అంతేకాకుండా “గ్యాంగ్ లీడర్” “జగదేకవీరుడు అతిలోకసుందరి” చిత్రాలు కూడా ఫ్యాన్స్ కు బాగా నచ్చడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు చిరంజీవిని దేవుడిలా కొలవడం మొదలుపెట్టారు.

 

బి.గోపాల్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమా కూడా కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక ఠాగూర్ సినిమా సక్సెస్ తో చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ చిత్రం మెగాస్టార్ అభిమానులతో పాటుగా సాధారణ అభిమానులను సైతం మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత కాస్త సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఘనవిజయం అందుకొని కం బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు.

also read:ఎన్టీఆర్ కోసం కృష్ణ పేపర్ ప్రకటించారు.. ఎందుకో తెలిస్తే..!!

Visitors Are Also Reading