వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె వయస్సు 38 సంవత్సరాలు. ఈమె నటుడు శరత్ కుమార్ కి తొలి భార్య ఛాయ ద్వారా కలిగిన సంతానం. ఈమెకు నటి రాధిక సవితి తల్లి. 2012 నుంచి వరలక్ష్మీ తెలుగు, తమిళ సినిమాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇన్నాళ్లుగా ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి తనకు ఎవ్వరితోనే బ్రేకప్ అయిందని.. ఆపర్స్ ఉన్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement
ఎప్పుడూ పెద్దగా తన వ్యక్తిగత జీవితం గురించి, కానీ తన భవిష్యత్ఆలోచనల గురించి మాట్లాడదు. తనేదో తన పనేదో… అంతే… ఆల్రెడీ జరిగిన బ్రేకప్ తో ఆమె మనసు విరిగిపోయిందనీ.. ఇక జీవితంలో పెళ్లే చేసుకోవద్దని నిర్ణయించుకుందని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అకస్మాత్తుగా తన పెళ్లి వార్తలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మార్చి 01న ముంబైలో క్లోజ్ సర్కిల్ నడుమ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.. ఆ ఫోటో కూడా బయటికొచ్చింది.. అంతేకాదు.. వాళ్లే బయటికి వదిలారు. ఇక మమ్మల్ని వదిలేయండ్రా బాబూ అన్నట్టుగా… వుడ్ బి పేరు నికోలయ్ సచ్‌దేవ్… వరలక్ష్మితో 14 ఏళ్ల పరిచయం ఉందట… తను ఓ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అని సమాచారం.
అందరూ అనుకున్నట్టు, ఊహించినట్టు సినిమా ఫీల్డ్ తో సంబంధం ఉన్నవాడు కాదట. వరలక్ష్మీ గుడ్ డెసిషన్ తీసుకుందని.. ఈ ఏడాదిలోనే కొంతకాలం తరువాత పెళ్లి జరుగుతుందని వరలక్ష్మి కుటుంబం అధికారికంగానే మీడియాకు చెబుతోంది. రాధిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ సమాచారం, ఫోటోలను పెట్టేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా ఉన్న నిలోలయ్ సచ్ దేవ్ పేరు వైరల్ అవుతోంది.
Also Read : ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?