Home » టాలీవుడ్‌లో మరో విషాదం…’గ్యాంగ్ లీడర్’ నటుడు మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం…’గ్యాంగ్ లీడర్’ నటుడు మృతి

by Bunty
Ad

మన టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని జనార్ధన్ ఇవాళ మృతి చెందారు.

Advertisement

అనారోగ్యంతో హైదరాబాదులో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1959లో ఏలూరు సమీపంలోని పోతునూరులో జన్మించిన జనార్దన్, సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. 21 ఏళ్ల వయసులోనే ‘అమాయక చక్రవర్తి’ సినిమాకు దర్శకత్వం వహించారు.

Advertisement

చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో సుమలత తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. పలు సినిమాలు కూడా నిర్మించారు. ముఖ్యంగా 1980లో కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గజదొంగ, ఆ తర్వాత తిరుగులేని మనిషి, కృష్ణంరాజు నటించిన రగిలే జ్వాలా చిత్రాలలో పనిచేశాడు జనార్ధన్‌. అటు కొండవీటి సింహం సినిమాకి కూడా పనిచేశాడు కానీ మధ్యలో వచ్చేశాడు. అప్పుడే “అర్జున్ ఆర్ట్స్” అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. సొంత అనుభవంతో “మామ్మగారి మనవలు” సినిమాను నిర్మించాడు. కాగా, వల్లభనేని జనార్ధన్ మృతి పట్ల పలుగురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : ఇండియాలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్, కేసీఆర్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు !

Visitors Are Also Reading