Home » BANGARRAJU : “బంగార్రాజు” టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్

BANGARRAJU : “బంగార్రాజు” టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్

by Bunty
Ad

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా బంగార్రాజు. నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక నాగార్జున సరసన ఈ సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా నాగచైతన్య కు జోడిగా… ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.

Advertisement

గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడు నాగార్జున కనిపించనుండగా… ఆయన వారసుడైన బుల్లి బంగార్రాజు గా నాగచైతన్య అలరించనున్నాడు. ఇక ఇప్పటికే… ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ లు సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా మరో అప్డేట్ వదిలింది చిత్రబృందం.

Advertisement

ఈ సినిమా నుంచి… బంగార్రాజు టైటిల్ సాంగ్ టీజర్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. వాసువడ తస్సాదియ్య అంటూ కింగ్ నాగార్జున, నాగచైతన్య ఇద్దరు కలిసి జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా తో ఆడిపాడారు. ఈ ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 19 వ తేదీన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక ఇవాళ రిలీజ్ అయిన..సాంగ్ టీజర్ క్షణాల్లోనే వైరల్ గా మారింది.

Visitors Are Also Reading