ఉయ్యాల జంపాల సినిమాతో కుర్రాళ్ళను తన వైపు తిప్పుకున్న హీరోయిన్ పునర్నవి భూపాలం. అయితే ఉయ్యాల జంపాల సినిమాలో పునర్నవి హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించినప్పటికీ ఆ తర్వాత పిట్టగోడ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఉయ్యాల జంపాల సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించగా ఆనందికి స్నేహితురాలి పాత్రలో పునర్నవి కనిపించింది.
Advertisement
ఇక హీరోయిన్ కంటే పునర్నవికే ఎక్కువ ప్రశంసలు అందాయి. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకుల మదిని దోచింది. అంతేకాకుండా పునర్నవి అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఏపీలోని తెనాలి పునర్నవి స్వస్థలం….. కాగా ఉయ్యాల జంపాల సినిమాతోనే ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ కూతురుగా నటించింది.
Advertisement
అంతేకాకుండా మనసుకు నచ్చింది సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక 2021లో చివరిగా సైకిల్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పునర్నవి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం పునర్నవి లండన్ లో ఉంటుంది. అక్కడే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు చూడ్డానికి సన్నగా చాలా అందంగా కనిపించేది పున్ను. కానీ ప్రస్తుతం మాత్రం కాస్త పొద్దుగా మారింది. దాంతో నెటిజన్స్ పునర్నవి ఇలా అయిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తావు అంటూ పునర్నవికి కామెంట్లు పెడుతున్నారు.
Also read : కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు జరిగాయి… ఇదే సాక్ష్యం!