తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అరుదైన ఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ముందుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. బి.గోపాల్ డైరెక్షన్ లో ప్రముఖ వ్యాపారవేత్త టి. సుబ్బిరాంరెడ్డి నిర్మాతగా చిరంజీవి హీరోగా, రాధా, భానుప్రియ హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా 177 ప్రింట్లతో థియేటర్లోకి రాగా విడుదలైన కొద్ది రోజుల వరకు నెగిటివ్ టాకు తెచ్చుకుంది.
Advertisement
also read:నర్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్….కానీ రెండేళ్లు గడవకముందే…!
Advertisement
ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకొని సంచలన కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ షూటింగ్ టైం లోనే ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే శశి భూషణ్ ఈనాడు విలేఖరి పై దురుసుగా ప్రవర్తించడంతో అప్పట్లో రామోజీరావు ఆగ్రహంతో ఈ సినిమా షూటింగ్ కవరేజ్ ఆపివేయాలని ఈనాడు విలేఖర్లకు ఆదేశాలు జారీ చేశాడు. ఆ విధంగా చాలా రోజులపాటు స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ కవరేజ్ ఆగిపోయింది.
చివరికి సుబ్బిరామిరెడ్డి రంగంలోకి దిగి ఈ విషయాన్ని క్లియర్ చేశారు.. ఆ తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన స్టేట్ రౌడీ మూవీ నైజాం ఏరియాలో కోటి రూపాయల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నైజాంలో ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి మూవీ స్టేట్ రౌడీ కావడం విశేషం. సినిమా విడుదలై దాదాపుగా 35 ఏళ్లు అవుతున్నప్పటికీ మెగా అభిమానులను ఇప్పటికి ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
also read: