సాధారణంగా ప్రతి రోజు చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. కానీ పోషకాల కొరత, సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, బిజీ లైప్ స్టైల్, శరీరానికి సరిపడా వాటర్‌ని అందించకపోవడం వంటి రకరకాల కారణాల మధ్యాహ్నానికే విపరీతమైన నీరసం వస్తుంటుంది. ఇలా మీకు జరుగుతుందా..? జరిగినట్టయితే ఏం పర్వాలేదు. ఇకపై ఇప్పుడు చెప్పబోయే హై ప్రోటీన్ సలాడ్‌ని మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఉండేలా చూసుకోండి. ఇక ఈ సలాడ్ మీకు అవసరమయ్యే ఎన్నో పోషక విలువలను అందించడమే కాదు. మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ ఉంచుతుంది. ఆలస్యం చేయకుండా ఆ సలాడ్‌ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
తొలుత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయరసం, హాప్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాప్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉడికించుకున్న కాబూలీ సెనగలు, వన్ కప్పు ఉడికించుకున్న స్వీట్‌కార్న్, ఒక కప్పు ఉడికించుకున్న రాజ్మా, ఒక కప్పు ఉడికించుకున్న కొర్రలు, ఒక కప్పు ఉల్లిపాయ తరుగు, అర కప్పు టొమాటో తరుగు, అరకప్పు కీర తురుగు వేసుకుని కలుపుకోవాలి.
Advertisement
ఇవి కూడా చదవండి : వినాయక చవితి రోజు ఈ 5 ప్రసిద్ధి దేవాలయాలను దర్శించుకుంటే అంతా శుభమే..!
ఇక చివరగా అందులో తొలుత తయారు చేసి పెట్టుకున్న నువ్వుల నూనె మిశ్రమం రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని బాగా దానిని మిక్స్ చేయాలి. ఇలా చేయడంతో హై ప్రోటీన్ సలాడ్ సిద్ధం అయినట్టే. ఈ సలాడ్ ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే ఆ రోజంతా శరీరానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది. ఇక నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి. ఫుల్ డే ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం హై ప్రోటీన్ సలాడ్ ఇలా తయారు చేసుకోండి.
ఇవి కూడా చదవండి : మీరు వేడి నీటిలో అల్లం కలిపి తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!