Home » రోనాల్డో పై కేసులో కీలక తీర్పు ఇచ్చిన కోర్టు..!

రోనాల్డో పై కేసులో కీలక తీర్పు ఇచ్చిన కోర్టు..!

by Azhar
Published: Last Updated on
Ad
వరల్డ్ వైడ్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఫుట్ బాల్ ఆటలో చాలా ప్రసిద్ధమైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఈయన గురించి ఫుట్ బాల్ చూసేవారికి కొత్తగా చెప్పాల్సిన వసరం లేదు. కానీ ఆ ఆటను చూడని వారికీ చెప్పాలంటే క్రికెట్ లో సచిన్ , విరాట్ కోహ్లీ ఎంతనో ఫుట్ బాల్ లో రోనాల్గొ కూడా ఆ తరహా ఆటగాడు. అయితే ఆట పట్ల ఎంతో పట్టుదలగా ఖచ్చితంగా ఉండే రోనాల్డో పై ఓ  ఉన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ కేసు ఇప్పుడు పెట్టింది కాదు.
12 ఏళ్ల క్రితం అంటే 2009 లో రోనాల్డో పై ఈ కేసు అనేది నమోదయ్యింది. అప్పుడు లాస్ వెగాస్ లోని ఓ హోటల్ లో రోనాల్డో తనను మానభంగం చేసాడు అని కేత్రిన్ మోయెర్గా అనే మహిళా అక్కడ స్థానిక కోర్టులో కేసు అనేది నమోదు చేసింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ కేసు అనేది కోర్టులో నడుస్తూనే ఉంది. అయితే తన జరిగిన అన్యాయానికి తనకు ఓనాల్డో దగ్గర నుండి మన రూపాయలలో 190 కోట్లు ఇప్పించాలని కోర్టును కోరింది ఆ మహిళ. ఇక ఈ కేసును 12 ఏళ్లుగా విచారిస్తున్న లాస్ వెగాస్ కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది.
తాజాగా లాస్ వెగాస్ కోర్టు రోనాల్డో పైన ఉన్న ఈ కేసును కొట్టేసింది. రోనాల్డో పై ఆరోపణలు చేసిన ఆ మహిళ కోర్టులో అందుకు తగ్గిన ఆధారాలను సమర్పించలేకపోయింది. దాంతో ఈ కేసును కొట్టేస్తూ… రోనాల్డో నిర్దోషి అని తెలిపింది. అలాగే మళ్ళీ ఈ కేసును దాఖలు చేయకుండా మొత్తం 42 పేజీల తీర్పును వెలువడించింది కోర్టు. ఇక ఈ తీర్పుతో రోనాల్డోకు ఊరట లభించింది అనే చెప్పాలి. ఇన్నాళ్లుగా మోస్తున్న ఓ నింద రోనాల్డో భుజాల మీద నుండి దిగిపోయింది. ఇక ప్రస్తుతం రోనాల్డో ఈ ఏడాది జరనున్న ఫిఫా వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాడు.

Advertisement

Visitors Are Also Reading