హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలుచుకుని ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
Advertisement
ఆట రసవత్తరంగా సాగుతోన్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే గ్రౌండ్ లోకి ఒక్కసారిగా రోహిత్ శర్మ అభిమాని దూసుకువచ్చి రోహిత్ శర్మ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేయగా రోహిత్ వద్దని వారించాడు. ఈ ఘటనతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది స్టేడియంలోకి పరుగున వచ్చి ఆ యువకుడిని లాక్కెళ్లారు.
Advertisement
భద్రతా ఏర్పాట్లలో భాగంగా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 360 సీసీ కెమెరాలు అరేంజ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసామని,1500 మంది పోలీసులతో మ్యాచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించుతున్నామని ,100 షీ టీమ్స్ మఫ్టీ లో ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించిన సంగతి తెల్సిందే. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ మ్యాచ్ జరుగుతూ ఉండటంతో ఈ ఘటన జరగడం అక్కడ సిబ్బందిలో ఒక్కసారి అవాక్కయ్యారు.