Home » రెండు సింహాలను దత్తత తీసుకున్న మెగా కోడలు…ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!

రెండు సింహాలను దత్తత తీసుకున్న మెగా కోడలు…ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!

by AJAY
Ad

రామ్ చరణ్ సతీమణి అపోలో సంస్థల వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల తరచూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన మరో సామాజిక కార్యక్రమం ద్వారా వార్తల్లోకెక్కారు. ఉపాసన కి పెట్స్ అంటే ఎంత ఇష్టమా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉపాసన ఇంట్లో కుక్కలు, పిల్లులు కాకుండా గుర్రాలు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగానే ఉపాసన రెండు సినిమాలను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్న లక్ష్మీ , విక్కీ అనే రెండు సింహాల ను ఉపాసన దత్తత తీసుకున్నారు.

Upasana konidela

Upasana konidela

దత్తత అంటే సింహాల సంరక్షణ బాధ్యత ను స్వీకరించ చడం…. అలా ఏడాది పాటు రెండు సింహాల బాధ్యత తనదేనని ఉపాసన స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకుగాను రెండు లక్షల చెక్కును జూపార్క్ క్యూరేటర్ కు ఉపాసన అందజేశారు. ఈరోజు ఉపాసన తన సోదరి తో కలిసి జూ పార్క్ ను సందర్శించారు. అక్కడ సిబ్బంది పనితీరు చూసి మెచ్చుకున్నారు. జూలో దాదాపు రెండు వేల జంతువులు ఉండగా వాటి బాధ్యతను చాలా బాగా చూసుకుంటున్నారని ఉపాసన కొనియాడారు. ఇదిలా ఉండగా ఉపాసన యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పోర్టల్ ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోవాలి… ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి అనే విషయాలను పంచుకుంటారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా మనకు తెలియని ఎన్నో ఆరోగ్య పరమైన విషయాలను ఉపాసన ఈ పోర్టల్ ద్వారా షేర్ చేస్తుంటారు. ఈ పోర్టల్ ద్వారా టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్లు ఆరోగ్యకరమైన వంటకాలు చేసి చూపించారు. ఉపాసన యువర్ లైఫ్ పోర్టల్ లో ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక లాంటి టాప్ హీరోయిన్ లు వచ్చి ఆరోగ్యకరమైన వంటలు వండి చూపించారు. ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉపాసన మెగా కోడలు సూపర్ అంటూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. ఇది మాత్రమే కాకుండా తమ ఆస్పత్రిలో ఎంతో మందికి ఉపాసన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Visitors Are Also Reading