Home » ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

by Bunty
Ad

ఉపాసన-రాంచరణ్ దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఉపాసన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తెలియజేయడంతో అభిమానులు తెగ సంతోషపడేవారు. ఇక ఉపాసన-రాంచరణ్ దంపతులు పెళ్లయిన 12 సంవత్సరాలకి తమ మొదటి బిడ్డకు జూన్ 20న ఉదయం 01:49 నిమిషాలకు జన్మనిచ్చారు.

Advertisement

ఇక ఉపాసన తన డెలివరీ కోసం తన సొంత హాస్పిటల్ అయినటువంటి అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. తన సొంత హాస్పిటల్ అయినప్పటికీ ఉపాసన తన డెలివరీ కోసం కొన్ని కోట్లలో డబ్బులు చెల్లించిందట. తన డెలివరీ కోసం ప్యారిస్ నుంచి కొంతమంది డాక్టర్స్ ను… అంతేకాకుండా కొన్ని అడ్వాన్స్ ఎక్యూప్మెంట్ పరికరాలను కూడా హైదరాబాద్ కు తీసుకువచ్చారట. వీటి కోసం ఉపాసన దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చుచేసిందట.

Advertisement

ఈ ఖర్చు మొత్తాన్ని రామ్ చరణ్ కట్టాడట. ఉపాసన తల్లిదండ్రులు మేమే డబ్బులు కడతామని చెప్పినా కూడా రామ్ చరణ్ వినకుండా తానే డబ్బును కట్టాడట. ఇలా రామ్ చరణ్…ఉపాసన డెలివరీ కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టాడట. కొన్ని సంవత్సరాలకి మెగా కుటుంబంలోకి వారసురాలి రాకతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇక తమ బిడ్డకి 21వ రోజు నామకరణం చేస్తామని… అంజలీదేవి అనే పేరు పెట్టాలని అనుకుంటున్నట్టు రామ్ చరణ్ మీడియాతో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్‌.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

రామ్‌చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!

Visitors Are Also Reading