Home » ఉన్ముక్త్ చంద్‌ కన్ను పోయేదిగా…?

ఉన్ముక్త్ చంద్‌ కన్ను పోయేదిగా…?

by Azhar
Ad

భారత జట్టుకు విరాట్ కోహ్లీ తర్వాత 2012 లో అండర్ 19 ప్రపంచ కప్ అనేది అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌. అయితే 2008 లో విరాట్ కోహ్లీ కూడా ఇలానే కెప్టెన్ గా ప్రపంచ కప్ తెచ్చిన తర్వాత అతనికి విపరీతమైన క్రేజ్ అనేది వచ్చింది. అయితే దానిని విరాట్ సరిగ్గా వాడుకున్నాడు. కానీ ఉన్ముక్త్ చంద్‌ అలా వాడుకోవడంలో విఫలం అయ్యాడు.

Advertisement

ఆ క్రేజ్ తోనే తాను ఏదో సాధించాను అనే ఫీలింగ్ వల్ల ఆటపై దృష్టి అనేది పక్కకు పెట్టడంతో ఇండియా జట్టులో చోటు అనేది దకించుకోలేదు. అయితే ఐపీఎల్ లో కూడా అతని ఆట బాగా లేకపోవడంతో.. ఉన్ముక్త్ చంద్‌ ను ఏ జట్టు కూడా కొనలేదు. అందువల్ల ఇండియా తరపున రిటైర్మెంట్ తీసుకొని.. యూఎస్ జట్టుకు ఆడుతూ.. విదేశీ లీగ్స్ లో పాల్గొంటున్నాడు. అటువంటి ఉన్ముక్త్ చంద్‌ కు ఇప్పుడు కన్ను పోయినంత పని అయ్యింది.

Advertisement

తాజాగా ఉన్ముక్త్ చంద్‌ తన ట్విట్టర్ లో కన్నుకు దెబ్బ తగిలిన ఫోటో పోస్ట్ చేసాడు. దానితో పాటుగా.. అథ్లెట్ లైఫ్ సాఫీగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఓ సారి విజయంతో వస్తే.. ఇంకొన్నిసార్లు ఓటమి.. వైఫల్యం.. గాయాలతో ఇంటికి రావాలి. నా కన్ను అనేది కొద్దిలో మిస్ అయ్యింది. కాబట్టి అందరూ కష్టపడండి.. కానీ జాగ్రత్తగా ఉండండి అని ఉన్ముక్త్ చంద్‌ చేసిన ట్విట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

టీమిండియా ఫ్యూచర్ అతనే..!

ప్రపంచ కప్ నెట్ బౌలర్లుగా హైదరాబాదీలు..!

Visitors Are Also Reading