Home » టీమిండియా ఫ్యూచర్ అతనే..!

టీమిండియా ఫ్యూచర్ అతనే..!

by Azhar
Ad
ఇండియాలో క్రికెట్ అనేది ఎంత పెద్ద ఆట అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్ ఆడే అన్ని దేశాలతో పోల్చితే మన దేశం ఎప్పుడు టాపర్ గానే ఉంటుంది. ఇక ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నది కూడా ఇండియాలోనే. అయితే ఇండియా జట్టులో ఉండే స్టార్ ఆటగాళ్లు జట్టు నుండి తప్పుకోవాల్సి సమయం వచ్చిన ప్రతిసారి కొత్త ఆటగాడు వెలుగులోకి వస్తున్నాడు .
అయితే ఇప్పుడు మన జట్టులో కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. వారు వెళ్లాల్సిన సమయం కూడా వస్తుంది. ఇక వారి స్థానంలో ఇండియాలోకి వచ్చే ఫ్యూచర్ ఆటగాడు ఎవరు అనే విషయాన్ని తాజాగా సునీల్ దవాస్కర్ కొడుకు.. భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ తెలిపాడు. అతను మాట్లాడుతూ.. ఇండియా జట్టులో ఫ్యూచర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌ అవుతాడు అని తెలిపాడు.
శుబ్‌మన్ గిల్‌ ప్రస్తుతం టెస్టులో స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో బాగా రాణించి ఇండియా జట్టులోకి వచ్చాడు. ఇక్కడ కూడా వైట్ బల్ ఫార్మాట్ లో శుబ్‌మన్ గిల్‌ అదరగొట్టాడు. అతనే ఇండియా జట్టుకు ఫ్యూచర్ ఆటగాడు. మనం చేయాల్సిన పని.. అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం. ఒక్క సిరీస్ లోనే రాణించకపోతే పక్కన పెట్టె ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ కాదు. అతని వద్ద చాలా టాలెంట్ అనేది ఉంది అని గవాస్కర్ అన్నాడు.

Advertisement

Visitors Are Also Reading