Home » రియల్ ట్రెండ్ సెట్టర్ బాలయ్య ! 14 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వరకు ఎన్ని ప్రయోగాలు చేసారో తెలుసా?

రియల్ ట్రెండ్ సెట్టర్ బాలయ్య ! 14 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వరకు ఎన్ని ప్రయోగాలు చేసారో తెలుసా?

by AJAY
Ad

సినిమాల్లోకి వార‌స‌త్వం ద్వారా ఎంట్రీ ఇస్తే సులువుగా స్టార్ అయిపోవ‌చ్చు అనుకుంటారు. కానీ అది అంత సులువు ఏమీకాదు. చాలా క‌ష్ట‌ప‌డాలి త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకోవాలి. ఇక టాలీవుడ్ ను ఏలిన ఎన్టీఆర్ న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో బాల‌య్య‌. స్టార్ హీరో కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ బాల‌య్య చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎన్టీఆర్ త‌న కెరీర్ లో ఒకేర‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌కుండా అన్ని విభిన్న పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

Advertisement

అదేవిధంగా బాల‌య్య కూడా విభిన్నమైన పాత్ర‌లతో ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బాల‌య్య పౌరాణిక పాత్ర‌లతో పాటూ సోషియోఫాంట‌సీ చిత్రాలు…హిస్టారిక‌ల్ సినిమాలు ఇలా అన్నిర‌కాల పాత్ర‌ల్లో న‌టించారు. బాల‌య్య 14 ఏళ్ల వ‌య‌సులో తాత‌మ్మ క‌ల చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. సినిమాలో ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా బాల‌య్య న‌టించాడు. బాల‌య్య 22 ఏళ్లకే వ‌సుంద‌ర‌ను వివాహం చేసుకున్నారు.

Advertisement

బాల‌య్య మొద‌టిసారి సోలో హీరోగా నటించిన సినిమా సాహ‌స‌మే జీవితం ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. బాల‌య్య ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి ల‌ది అప్ప‌ట్లో హిట్ కాంబినేష‌న్ వీరిద్ద‌రి కాంబో 13 సినిమాలు రాగా 9 సినిమాలు హిట్ అయ్యాయి. ఇక బాలయ్య సినిమాల టైటిల్స్ లో సింహం పేరు వ‌చ్చేలా పెట్ట‌డానికి కూడా ఒక కార‌ణం ఉంది.

బాల‌య్య నర‌సింహ‌స్వామి భ‌క్తుడు అందువల్ల‌నే బాల‌య్య సినిమాల‌కు సింహా అనే పేరును జోడించ‌గా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. బాల‌య్య ఏకంగా 12 సినిమాల‌లో పోలీస్ పాత్ర‌ల‌ల‌లో నటించి మెప్పించాడు. 1987లో బాల‌య్య ఏకంగా 8 సినిమాల‌తో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద సంద‌డి చేశారు. బాల‌య్య విజ‌య‌శాంతిల‌ది హిట్ పెయిర్ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఏకంగా 17 సినిమాలు వ‌చ్చాయి. ఇక బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కూ డ‌బ్బుల‌కు ఆశ‌పడి ఏ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ లో న‌టించ‌లేదు.

Visitors Are Also Reading