కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ్ తెరకెక్కించి ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. కాగా రికార్డు స్థాయి కలెక్షన్స్ తో సినిమా దూసుకువెళ్లిపోయింది. సినిమాలోని పాటలు, స్క్రీన్ ప్లే, నటీనటుల పర్ఫామెన్స్ ఇలా ప్రతి ఒక్కటీ హైలెట్ గా నిలిచాయి.
Advertisement
ఈ సినిమా తరవాత సూర్యకు సౌత్ మొత్తం క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా ఆరోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. అయితే ఇలాంటి కథను ఏకంగా 12 మంది రిజెక్ట్ చేశారట. ఈ సినిమాను మురుగదాస్ మొదట నిర్మాత సురేష్ బాబుకు చెప్పారట. మహేశ్ బాబుతో చేయానుకుంటున్నానని చెప్పి మహేశ్ కు కథ వినిపించారట. కానీ మహేశ్ బాబు కథలో క్యారెక్టర్ తనకు సూట్ కాదని రిజెక్ట్ చేశారట.
Advertisement
దాంతో ఇదే కథను మురుగదాస్ వెంకటేష్ కు వినిపించారు. కానీ వెంకీ కూడా రిజెక్ట్ చేశారు. ఆ తరవాత మురుగదాస్ ఇదే కథను అల్లు అరవింద్ కు వినిపించి పవన్ తో చేయాలనుకుంటున్నట్టు చెప్పారట. కానీ జానీ ఫ్లాప్ తో ఉన్న పవన్ కథ కూడా వినకుండా నో చెప్పారట. కానీ అల్లు అరవింద్ మాత్రం కథ చాలా బాగుందని చెప్పారట. ఇక తెలుగు స్టార్స్ నో చెప్పడంతో మురుగదాస్ మళ్లీ తమిళ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొదట కమల్ హాసన్ కు వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారు.
ఆ తరవాత విజయ్ కి వినిపించగా ఆయన కూడా నా వల్ల కాదని చెప్పారట. ఆ తరవాత చాలా మంది హీరోల వద్దకు వెళ్లిన మురుగదాస్ చివరికి అజిత్ దగ్గరకు వెళ్లారట. అజిత్ కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షూటింగ్ కూడా ప్రారంభించారు.
కానీ అజిత్ సడెన్ గా షూటింగ్ నుండి తప్పుకున్నారు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. కానీ మురుగదాస్ కసి మాత్రం అలాగే ఉంది. చివరికి అప్పుడప్పుడే పేరు సంపాదించుకుంటున్న సూర్యను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా పన్నెండు మంది రిజెక్ట్ చేసిన కథతో సూర్య బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ALSo ReAd : వైజాగ్ సాయి ప్రియ సీన్ యూపీలో రిపీట్….! ఉంటే ప్రియుడితోనే లేదంటే….?