తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి టాలీవుడ్ సత్తాను ఇండియా వ్యాప్తంగా చాటారు. ఇప్పటి వరకూ తన కెరీర్ లోనే ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా రాజమౌళి నిలిచారు. వందల కోట్ల బడ్జెట్ వేల కోట్ల కలెక్షన్లు అనే పేరు వినిపిస్తుంది అంటే అది రాజమౌళి సినిమాలకే అని చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం తెలుగు హీరోలు పరితపించేవారు.
Advertisement
కానీ ఇప్పుడు తెలుగు దర్శకులతో సినిమాలు చేయాలని బాలీవుడ్ నటీనటులు తహతహలాడుతున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి రికార్డుల గురించి సినిమాల గురించి ప్రతిఒక్కరికీ తెలుసు కానీ ఆయన బాల్యం గురించి మాత్రం అతితక్కువ మందికి మాత్రమే తెలుసు. రాజమౌళి చిన్నవయసులో ప్చశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉండేవారట. తాజాగా రాజమౌళి తల్లి రాజనందిని స్నేహితురాలు అయిన పాపాయమ్మ ఓ ఇంటర్వ్యూలో జక్కన్న గురించి ఆయన తల్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Advertisement
రాజమౌళి బాల్యంలో తన ఇంటిపక్కనే ఉండేవాడని చెప్పారు. అంతే కాకుండా రాజమౌలి అసలు పేరు బంటి అని కానీ రాజమౌళి అని తమకు తెలియదని చెప్పారు. చిన్నవయసులో ఎక్కువగా కథల పుస్తకాలు చదువుతూ ఉండేవాడని అన్నారు.రాజమౌళి తాత పాపారావు కూడా ఊర్లో గొప్పవారని చెప్పారు. రాజమౌళి బ్యాంకు మేనేజర్ కావాలని ఆయన తల్లి అనుకున్నారని కానీ దర్శకుడు అయ్యారని చెప్పారు.
పదిమందికి అన్నం పెడుతున్నాడని రాజమౌళి తల్లి సంతోషించేదని చెప్పారు. రాజమౌళి ఏడవ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడని అన్నారు. రాజమౌళి వాళ్లకు అప్పట్లోనే కోట్ల ఆస్తులు ఉండేవని వారికి ఆరు వందల ఎకరాల ఆస్తి ఉండేదని చెప్పారు. కానీ అప్పుడూ ఇప్పుడూ రాజమౌళి ఒకేళా ఉన్నారని అన్నారు. సింహాద్రి సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి వచ్చి తమను కలిశాడని ఆనందం వ్యక్తం చేశారు.
ALSO READ : చిరును ఇబ్బంది పెట్టిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. చివరికి ఆ రూమ్ లోకి పిలిచి.. ఏం..?