సినిమా ఇండస్ట్రీలో కుటుంబంలో ఒకరు సక్సెస్ అయ్యారంటే ఆ వెంటనే వారి కుటుంబం నుండి ఒక్కొక్కరుగా పరిచయం అవుతూ ఉంటారు. అయితే ఎంతమంది వచ్చినా ఎలా వచ్చినా టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు…తమ్ముళ్లు ఇలా చాలా మంది వస్తే కొద్దిమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
ALSO READ :చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!
Advertisement
ఇక చిరంజీవి మెగాస్టార్ గా మారిన తరవాత ఆయన తమ్మళ్లు నాగబాబు మరియు పవన్ కల్యాణ్ లు కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో పవన్ కల్యాణ్ మెగాస్టార్ రేంజ్ లోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నాడు. అయితే చిరు ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మాత్రం స్టార్ హీరో అవ్వలేకపోయాడు.
ALSO READ :లవర్ కోసం కలెక్టర్ అయ్యాడు.! కోట్ల జీతం వదిలి కొత్త జీవితంలోకి….!
Advertisement
దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం..మొదట నాగబాబు చిరంజీవి సినిమాలో చిన్నచిన్న పాత్రలు చేసేవాడు. ఆ తరవాత నాగబాబు హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కానీ హీరోగా సరైన హిట్ పడలేదు. చిరంజీవి తమ్ముడు అనే ఇమేజ్ ఉండటంతో నాగబాబు పై అంచనాలు పెరిగాయి కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయాడు. ఆ తరవాత నిర్మాతగా మారాడు.
అంతే కాకుండా నాగబాబు నిర్మాతగా మారి సంపాదించుకోకపోగా చేతులు కాల్చుకున్నాడు. ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ..నాగబాబు కాన్స్టంట్ గా ఉండగా కొన్నిరోజులు నటుడుగా కొన్నిరోజులు హీరోగా…నిర్మాతగా చేశాడని అందుకే సక్సెస్ అవ్వలేకపోయాడు అని చెప్పారు. ఒకరకంగా చూస్తే చిరంజీవి చెప్పింది కూడా నిజమే అని పిస్తుంది.
also read :పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?