నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అభిమానులను సంపాదించుకుంటారు. బాలయ్య సినిమా ఇక్కడ విడుదలైతే డల్లాస్ తో కార్ లతో ర్యాలీలు చేస్తారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ ఏ హీరో సినిమా విడుదలైనా మొదటి రోజున అమ్మాయిలు థియేటర్ స్క్రీన్ పైకి ఎక్కి డ్యాన్స్ లు చేసింది లేదు.
Advertisement
కానీ బాలయ్య అఖండ సినిమా విడుదలైన రోజు ఓ థియేటర్ లో అమ్మాయిలు స్క్రీన్ పైకి ఎక్కి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇక బాలయ్యను బయట చూస్తే ఎవ్వరైనా బయపడిపోవాల్సిందే. బాలయ్య ముందు ఎవరైనా కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే ఒక్కటి పీకుతాడు. దాంతో బాలయ్య బాబు అంటే బయపడతారు. కానీ బాలయ్య సైతం భయపడే వ్యక్తి ఒకరు ఉన్నారు.
Advertisement
బాలయ్య బయట ఎవరికీ భయపడే ముచ్చటే లేదు కానీ తన చిన్న కూతురుకు మాత్రం చాలా బయపడతారట. బాలయ్య పెద్దకూతురు బ్రాహ్మిణి నారా లోకేష్ సతీమణి అని హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటారని అందరికీ తెలుసు కానీ బాలయ్య చిన్న కూతురు తేజష్వి ఏం చేస్తారు..? ఆమె ఎక్కడ ఉంటారు అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. బాలయ్య బయపడే ఒకే ఒక్క వ్యక్తి తేజస్విని….ప్రస్తుతం బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటుంది ఆవిడే.
ఇది వరకూ బాలయ్య సినిమా డేట్స్, ఇతర ప్రోగ్రాంలు డాక్టర్ సురేందర్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు తేజస్విని చూసుకుంటున్నారు. అంతే కాకుండా బాలయ్య ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తేజస్వినినే నిర్ణయిస్తారట. ఇదివరకూ బాలయ్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి ఆయన సతీమణి చూసుకునేవారు కానీ ఇప్పడు తేజశ్విని చూసుకుంటున్నారు. ఇక తేజశ్విని గీతం యూనివర్సిటీ యజమాణి మూర్తి మనవడు శ్రీభరత్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో పాటూ బాలయ్య సినిమా వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.