Home » ఐర‌న్ లెగ్ అనుకుంటే గోల్డెన్ లెగ్ అయ్యింది…! శృతిహాస‌న్ బ్రేక్ ఇచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే…!

ఐర‌న్ లెగ్ అనుకుంటే గోల్డెన్ లెగ్ అయ్యింది…! శృతిహాస‌న్ బ్రేక్ ఇచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే…!

by AJAY
Ad

క‌మ‌ల్ హాస‌న్ వార‌స‌త్వంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాస‌న్ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ ఉంది. స‌లార్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అవ్వ‌బోతుంది. శృతిని కెరీర్ ప్రారంభంలో న‌టించిన చిత్రాలన్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఐర‌న్ లెగ్ అని ముద్ర ప‌డింది.

Advertisement

 

కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ సినిమాకు ముందు ప‌వ‌న్ కూడా వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మ‌తం అయ్యారు. కానీ ఈ సినిమా హిట్ ప‌డ‌టంతో ప‌వ‌న్ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుంది.

ర‌వితేజ వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మతం అవుతున్న స‌మ‌యంలో బ‌లుపు సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో ర‌వితేజ‌కు హిట్ ప‌డింది.

రామ్ చ‌ర‌ణ్ కూడా ఎవ‌డు సినిమాకు ముందు వ‌రుస ఫ్లాప్ ల‌తో డీలా ప‌డిపోయాడు. కానీ మ‌ళ్లీ ఎవ‌డు సినిమాతో ఫామ్ లోకి వ‌చ్చాడు. ఈ సినిమాలో రామ్ చ‌రణ్ కు జోడీగా శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

వ‌రుస ఫ్లాప్ ల‌తో ఇబ్బంది ప‌డిన అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమాలో శృతి బ‌న్నీకి జోడీగా న‌టించి ఆక‌ట్టుకుంది.

మ‌హేశ్ బాబు సైతం త‌న కెరీర్ లో శ్రీమంతుడు సినిమాకు ముందు స‌రైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. కానీ శ్రీమంతుడు సినిమా మ‌హేశ్ కెరీర్ లోని బెస్ట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది. దాంతో ఈ సినిమా త‌ర‌వాత మ‌హేశ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు.

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య కు సైతం శృతి వ‌ల్ల సూప‌ర్ హిట్ వ‌చ్చింది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన ప్రేమ‌మ్ సినిమా మంచి విజ‌యం సాధించింది.ఈ సినిమా కు ముందు చైతూ కూడా సరైన హిట్ లేక ఇబ్బంది ప‌డ్డాడు.

Krack

Krack

బ‌లుపు సినిమాతో ఫ్లాప్ ల‌లో ఉన్న ర‌వితేజ‌కు గోల్డెన్ గ‌ర్ల్ గా మారిన శృతి హాసన్ రెండో సారి కూడా ర‌వితేజ‌కు ప్ల‌స్ అయ్యింది. ఫ్లాప్ ల‌తో ఉన్న స‌మ‌యంలో ర‌వితేజ శృతి కాంబోలో వ‌చ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.

AlSO ReAd : LAAL SINGH CHADDA REVIEW : “లాల్ సింగ్ చ‌డ్డా” సినిమా రివ్యూ ..!

Visitors Are Also Reading