Home » అల్లు అర్జున్ అన్నయ్య మొదటి భార్య మళ్లీ పెళ్లి చేసుకున్నారా?

అల్లు అర్జున్ అన్నయ్య మొదటి భార్య మళ్లీ పెళ్లి చేసుకున్నారా?

by Bunty
Ad

 

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, బిజినెస్ మాన్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక అల్లు అరవింద్ వ్యక్తిగత విషయానికి వస్తే…. అతనికి వివాహమై ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

Unknown Facts About Allu Bobby Ex wife Neelima Bandi

అల్లు అర్జున్, అల్లు శిరీష్ వీరిద్దరే కుమారులు అని అంతా అనుకుంటారు. కానీ ఇతనికి మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఇక మరో కుమారుడు అల్లు వెంకటేష్. ఇతను సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ హీరో అన్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ రావడం లేదు. ఇక అల్లు వెంకటేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇతనికి నీలిమ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. 2018లో నీలిమ, వెంకటేష్ ల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Advertisement

Advertisement

ఇక వీరికి పుట్టిన పాపను మాత్రం ఇద్దరూ చూసుకుంటూ ఉంటారు. విడాకులు అనంతరం వెంకటేష్ మరో వివాహం చేసుకున్నాడు. కానీ నీలిమ చేసుకోలేదు. ఐదు సంవత్సరాలుగా ఒంటరిగానే ఉంటుంది. ఇక నీలిమ విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంతో చాలా స్నేహంగా ఉండేది. ముఖ్యంగా అల్లు అర్జున్, స్నేహతో నీలిమకి మంచి బాండింగ్ ఉండేది. ఇక విడాకులు తీసుకున్న ఐదు సంవత్సరాలకి నీలిమ పెళ్లి పీటలు ఎక్కిందట. నీలిమ వివాహానికి అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ముఖ్య అతిథులుగా వెళ్లారని సమాచారం.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading