యూనిఫామ్ లను మొదటగా 17వ శతాబ్దంలో యూరప్ లో కోర్ట్ లలో పనిచేసే ధరించారు. వివిధ కోర్టులున్నప్పటికీ ఒకే కోర్ట్ లో పనిచేసే వాళ్లు ఒకే రకమైన యూనిఫాం ధరించడంతో వారిని గుర్తించడం సులభమయ్యేది., ఇక కోర్ట్ ల తర్వాత ఈ యూనిఫాం విధానం మిలటరీలోకి వచ్చింది. యూరప్ లోని వివిధ దేశాల సైనికులు వివిధ రకాల యూనిఫామ్స్ ను ధరించడం ప్రారంభించారు. వీటిని అప్పట్లో లైవరీలు అనేవారు. వివిధ ర్యాంకుల సైనికులు వివిధ రకాల యూనిఫాం లను ధరించేవారు. ఇప్పటికే అదే కొనసాగుతుంది.
Advertisement
Advertisement
18వ శతాబ్దానికి వచ్చే సరికి వివిధ సేవాగ్రూప్ లలో పనిచేసే వారు కూడా ఈ యూనిఫాం విధానాన్ని ప్రారంభించారు. మొదట బ్యాడ్జ్ లతో నడిపించినప్పటికీ తర్వాతర్వాత తమకూ ఓక ప్రత్యేక గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో పోస్ట్ లు అందించేవాళ్లు కూడా యూనిఫామ్ లోకి మారారు. తమ పనికి ఆటంకం ఉండకుండా కూడా వీరికి వారి వారి యూనిఫాంలు ఉపయోగపడ్డాయి!
అలా మొదలైన యూనిఫామ్స్ తర్వాతర్వాత అంతరాలు తొలగించే ఉద్దేశ్యంతో కొనసాగుతూ వచ్చాయి. యూనిటీ, అందరూ సమానం అనే భావన, మన అనే భావనల కోసం యూనిఫాం విధానం కొనసాగుతూనే ఉంది.
Also Read: అఖండ సినిమాలో కీ రోల్ చేసిన ఈ నటి ఎవరో తెలుసా…?