Home » అఖండ సినిమాలో కీ రోల్ చేసిన ఈ నటి ఎవరో తెలుసా…?

అఖండ సినిమాలో కీ రోల్ చేసిన ఈ నటి ఎవరో తెలుసా…?

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన సింహా లెజెండ్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రోజు సినిమా విడుదల కాగా ఆ అంచనాలను రీచ్ అయినట్టే కనిపిస్తోంది. సర్వత్రా అఖండ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో బాలయ్య అఖండ, రామకృష్ణ అనే రెండు పాత్రల్లో నటించి అలరించారు. సినిమాకు తమన్ స్వరాలు బాలయ్య యాక్షన్ సన్నివేశాలు ప్లస్ గా నిలిచాయి. అదేవిధంగా ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

Akhanda actress Naveena reddy

Akhanda actress Naveena reddy

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది. నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది. నవీన రెడ్డి ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న రోల్ చేసింది. తర్వాత వెంకీ మామ, భీష్మ, అద్భుతం లాంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా అర్ధ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలలో రాని గుర్తింపు నవీనా రెడ్డికి అఖండ సినిమాతో వచ్చింది.

Advertisement

మరి నవీన రెడ్డి నెక్స్ట్ ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే నవీన రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేశారు. అంతేకాకుండా నవీన రెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలపై అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది.

Also Read: ప‌వ‌న్ కు రాజ‌కీయాలు అచ్చిరావు..జ‌న‌సేన ఉండ‌దు..వేణుస్వామి సంచ‌ల‌న కామెంట్స్..!

Visitors Are Also Reading