Home » నరేష్-పవిత్ర పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా ? 

నరేష్-పవిత్ర పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా ? 

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం విధితమే. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా తమ ప్రేమని వ్యక్తం చేస్తూ.. ఓ వీడియో క్లిప్ కూడా పంచుకున్నారు. ఆ సమయంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు చిన్న హింట్ ఇచ్చారు. తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వీరు పెళ్లి బంధంతో ఒక్కటైనట్టు ట్విట్టర్ వేదికగా నరేషన్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 

Also Read :  శ్రీ రెడ్డికి ఎప్పుడో పెళ్లయింది… భర్త ఎవరో తెలుసా?

Advertisement

ముఖ్యంగా వేద మంత్రాలు, పండితులు, అగ్ని సాక్షిగా మెడలో మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడుస్తున్నటువంటి వీడియోని పంచుకున్నారు నరేష్.ముఖ్యంగా ఇందులో ఒక పవిత్ర బంధం, రెండు మనసులు మూడు ముళ్లు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ.. ఇట్లు ప్రేమతో మీ పవిత్ర నరేష్ అంటూ ట్వీట్ చేశారు నరేష్. అభిమానులు స్పందిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. లేటు వయస్సులో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వీరి పెళ్లి సోషల్ మీడియాలో మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ పెళ్లిలో పెద్ద ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వాస్తవం కాదని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెళ్లి ఓ సినిమా కోసం నరేష్, పవిత్ర ఆడిన డ్రామా అని తెలుస్తోంది. 

Advertisement

Also Read : పెళ్లిచూపుల్లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ అడిగిన 2 ప్రశ్నలు.. యంగ్ టైగర్ మామూలోడు కాదుగా..?

ముందుగానే సినిమాపై బజ్ క్రియేట్ చేయడం కోసం నరేష్, పవిత్ర ఇలా చేసినట్టు సమాచారం. ఎం.ఎస్.రాజు రూపొందించబోతున్న సినిమా కోసం ఇది చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ని విడుదల చేయబోతున్నారట. మరోవైపు పెళ్లి నిజం కాదని.. బలం చేకూరేవిధంగా నరేష్ ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన ఇంటింటి రామాయణం చిత్ర ప్రెస్ మీట్ లో పాల్గొనడం విశేషం. పెళ్లి చేసుకొని దుబాయ్ లో ఉంటే.. ప్రెస్ మీట్ కి ఎలా వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు ఇదంతా నరేష్, పవిత్ర ఆడిన డ్రామా అని పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిలు చేసుకున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో కూడా విడిపోయాడు. వీరికి లీగల్ గా ఇంకా విడాకులు రాలేదు. ఈ వ్యవహారం మాత్రం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో వీరు అధికారికంగా పెళ్లి చేసుకోవడానికి మాత్రం వీలు లేదు. ఇక ఇవన్నీ చూస్తుంటే.. నరేష్, పవిత్రల పెళ్లి వాస్తవం కాదని తెలుస్తోంది.  ఏం జరిగిందనేది వేచి చూడాలి మరి. 

Also Read :   ఆ ఒక్క సినిమాతో అంతమంది దర్శకులు పరిచయం కానున్నారా..? 

Visitors Are Also Reading