సచిన్, రోహిత్ సరసన మరో ప్లేయర్ చేరిపోయాడు. ఆరంగేట్రంతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అతను ఎవరో కాదు భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ అందించిన యశ్‌ధుల్.. ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను సెంచరీతో ఘనంగా ప్రారంభించాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన రంజీ టోర్నీ రెండేండ్ల తరువాత ప్రారంభం అయింది. అయితే ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్ కెప్టెన్ రోహిత్ సరసన యశ్‌దుల్ చోటు సంపాదించడం విశేషం.
Also Read : ASHU REDDY : అందం చూడమంటే కారు చలాన్లు చూశారు..అడ్డంగా బుక్కైన అష్షు రెడ్డి..!
Advertisement
బరస్పరాలోని ఏసీఏ మైదానంలోని ఢిల్లీ తమిళనాడు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఆరంభం అయింది. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ అద్భుత ఇన్నింగ్ ఆడాడు. మొదటి రోజు లంచ్ తరువాత 136 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తం 150 బంతులు ఎదుర్కున్న యశ్‌ధుల్ 113 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లున్నాయి. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యశ్ ధుల్ 136 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 97 పరుగుల వద్ద యశ్ ఔట్ అయినా అది నో బాల్ కావడంతో బతికి పోయాడు.
Advertisement
టీమిండియాకు సారథ్యం వహించిన చివరి ఐదుగురు అండర్ -19 కప్టెన్లలో నలుగురు ఫస్ట్ క్లాస్ ఆరంగేట్రంలోనే సెంచరీ చేయడం విశేషం. రంజీ ట్రోపీ ఆరంగేట్రం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా యశ్‌ధుల్ నిలిచాడు. అంతకు ముందు గుజరాత్ బ్యాటర్ నారీ కాంట్రాక్ట్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తిగా.. మహారాష్ట్ర బ్యాటర్ విరాగ్ అవతే రెండవ ఆటగాడిగా ఉన్నాడు. మొత్తానికి యశ్ ధుల్ తన ఫామ్‌ను రంజీల్లో కొనసాగిస్తున్నాడు.
Also Read : కిమ్ సాగుబాట.. భూమిని బాంబు పేల్చి శంకుస్థాపన