Home » ASHU REDDY : అందం చూడ‌మంటే కారు చ‌లాన్లు చూశారు..అడ్డంగా బుక్కైన అష్షు రెడ్డి..!

ASHU REDDY : అందం చూడ‌మంటే కారు చ‌లాన్లు చూశారు..అడ్డంగా బుక్కైన అష్షు రెడ్డి..!

by AJAY
Ad

సెల‌బ్రెటీలు నెటిజ‌న్ల ద‌గ్గ‌ర చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.సోషల్ మీడియా కాలంలో ఆవ‌లిస్తే పేగులు లెక‌పెట్టెలా నెటిజ‌న్లు త‌యార‌య్యారు. ఏం మాట్లాడాల‌న్నా జాగ్ర‌త్తగా ఆలోచించడ‌మే కాదు ఎక్క‌డ ఫోటో దిగా ఎక్క‌డ దిగ కూడ‌దు అనేది కూడా ముందే ఆలోచించాలి. ఇటీవ‌ల నేష‌న‌ల్ క్ర‌ష్ న్యూయ‌ర్ పార్టీకి గోవాకు వెళ్లింది. అక్క‌డ ఎంజాయ్ చేసిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోల‌లో ర‌ష్మిక వెన‌కాల నెటిజ‌న్లు ఓ స్విమ్మింగ్ ఫూల్ ను చూశారు.

Advertisement

అయితే అదే స్విమ్మింగ్ ఫూల్ లోకేష‌న్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ దిగిన ఫోటోల‌లోనూ క‌నిపించింది. దాంతో ర‌ష్మిక రౌడీ హీరోతో గోవాలో న్యూయ‌ర్ పార్టీ ఎంజాయ్ చేస్తుంద‌ని ప‌ట్టేశారు. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అష్షు రెడ్డికి కూడా తాను దిగిన ఫోటోతో తిప్ప‌లు వ‌చ్చిప‌డ్డాయి. అష్షు రెడ్డి ఎప్పుడూ హాట్ హాట్ అందాల‌తో ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతూ ఉంటుంది.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే అష్షు రెడ్డి తాజాగా త‌న కారు వ‌ద్ద అందాలు వ‌ల‌క‌బోస్తూ ఫోటోల‌ను షేర్ చేసింది. అయితే ఫోటోలో అష్షును ప‌ట్టించుకోకుండా నెటిజ‌న్లు ఆమె కారు నంబ‌ర్ చూశారు. అంతే కాకుండా ఆమె కారుకు ఎన్ని చ‌లాన్లు ఉన్నాయో వెతికి మ‌రీ చూశారు. అలా చూసిన ఓ నెటిజన్ కారుకు రూ.2305 చ‌లాన్లు ఉన్నాయి క‌దా అంటూ కామెంట్ పెట్టాడు.

దానికి అష్షు రెడ్డి స‌మాధానం ఇస్తూ అవునురా బాబు క‌డ‌తాను లే అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మ‌రోనెటిజ‌న్ అందం చూడ‌మంటే చాలాన్లు చూస్తారేంట్రా బాబు అంటూ కామెంట్ చేశారు. మ‌రో నెటిజ‌న్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి క‌దా అష్షూ అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఫోటో య‌వ్వారం బిగ్ బాస్ బ్యూటీకి త‌ల‌నొప్పిగా మారింది.

Visitors Are Also Reading