సన్ రైజర్స్ హైదారాబాద్ జట్టు తరపున ఐపీఎల్ 2021 లో ఎంట్రీ ఇచ్చిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్.. ఈ ఏడాది సన్ రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్ లలో ఆడి సూపర్ అనిపించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ 2022 లో ఉమ్రాన్ చేసిన ప్రదర్శన వల్ల అతనికి భారత జట్టులో కూడా చోటు అనేది తొందరగానే వచ్చింది. కానీ అంతే తొందరగా పోయింది కూడా.
Advertisement
ఇండియా జట్టుకు కొన్ని మ్యాచ్ లే ఆడిన ఉమ్రాన్ మాలిక్ సరిగ్గా రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ మళ్ళీ జట్టులోకి రీ ఎంట్రీ అనేది ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది. అయితే నిన్ననే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగించిన భారత జట్టు.. 28 నుండి సౌత్ ఆఫ్రికాతో ఇదే పొట్టి సిరీస్ లో తలపడబోతుంది. కానీ ఈ రెండు సిరీస్ లకు ఎంపికైన భారత సీనియర్ పేసర్ మొహ్మద్ షమీకి కరోనా సోకింది.
Advertisement
అందువల్ల మొదట ఆస్ట్రేలియా సిరీస్ దూరం అయ్యాడు. దాంతో అతని స్థానంలో వచ్చిన ఉమేష్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు సఫారీలతో జరిగే సిరీస్ వరకు కూడా షమీ ఫిట్నెస్ సాధించడం అనేది అనుమానంగా తయారైంది. అతనిపై బీసీసీఐ మెడికల్ సిబ్బంది ఫోకస్ పెట్టింది. అందుకే అతని స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను తీసుకురావాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :