మే మాసంలో ఐపీఎల్ పూర్తయిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఐపీఎల్ తో టీం ఇండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇందుకోసం లండన్ కు వెళ్ళింది టీమ్ ఇండియా. ఈ డబ్ల్యూ టి సి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత టీమిండియాలో ఓ నలుగురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. ఆ నలుగురు క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఇశాంత్ శర్మ : టీమిండియా అద్భుతమైన పేసర్లతో నిండిపోయింది. అందువల్ల ఇషాంత్ శర్మ ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
Advertisement
ఉమేష్ యాదవ్ : సిరాజ్, శార్దూల్ లు జట్టులో ఉండడంతో ఉమేష్ రిటైర్మెంట్ ను ఎదుర్కోవచ్చు.
వృద్ధిమాన్ సాహ: ధోని టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ తర్వాత వృద్ధిమాన్ సాహ ప్రధాన వికెట్ కీపర్ గా మారాడు. అయితే రిషబ్ పంత్ జట్టులోకి వచ్చిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో సాహా రిటైర్మెంట్ దాదాపు ఖాయమైంది.
మయాంక్ అగర్వాల్ : మార్చి 2022 తర్వాత అగర్వాల్ ఏ టెస్ట్ మ్యాచ్ కి ఎంపిక కాలేదు. రానున్న రోజుల్లో మయాంక్ కు సీటు దక్కడం అనుమానమే.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?
కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!
పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?