Home » ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీరిలీజ్.. ఎప్పుడంటే..?

ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీరిలీజ్.. ఎప్పుడంటే..?

by Sravya
Ad

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఉదయ్ కిరణ్ మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో ఒకరు ఉదయ్ కిరణ్. కొంతకాలం క్రితం నువ్వు నేను అనే సినిమాలో హీరోగా నటించారు ఈ మూవీలో అనిత హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆర్పి పట్నాయక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. సినిమా పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001లో ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

Advertisement

పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగా పెరిగాయి. చివరగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఆ టైంలో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాని మళ్లీ ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో రిలీస్ ట్రెండ్ నడుస్తోంది.

Advertisement

ఇప్పటికే చాలా సినిమాలని మళ్ళీ రిలీజ్ చేశారు ఈ మూవీ బృందం వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది మార్చి 21వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా రీ రిలీజ్ కి వెళ్లాలని ఎదురుచూస్తున్నారు ఉదయ్ కిరణ్ అతి కొద్ది సమయంలోనే పెద్ద హీరోగా ఎదిగారు. కానీ దురదృష్టవశాత్తు కొన్నాళ్ళకి కెరీర్ లో ఇబ్బందులు రావడం సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వలన ఉదయ్ కిరణ్ అమాంతం పడిపోయారు. తర్వాత ఆవేశంలో నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading