అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉదయ్ సహారన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. 84 పరుగులతో ఘన విజయంతో టోర్నీని మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 76 పరుగులు, కెప్టెన్ ఉదయ్ సహారన్ 64 పరుగుల సహకారంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయి బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లు పూర్తిగా ఆడలేక 45.5 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
Advertisement
Advertisement
టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 7 పరుగులకే ఇన్నింగ్స్ ముగించగా.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ముషీర్ ఖాన్ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌తో కలిసి కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టు ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. వీరిద్దరూ కలిసి టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లారు.
బంగ్లాదేశ్ తరపున బౌలింగ్‌లో రాణించిన మారుఫ్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు.భారత్ తరపున బౌలింగ్‌లో మెరిసిన సౌమ్య పాండే 9.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడికి తోడు ముషీర్ ఖాన్ 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.