రీసెంట్ గా మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహ* కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రీతి మెడిసిన్ పీజీ చదువుతోంది. అయితే ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురి చేయడంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రీతి సీనియర్ లు మరియు వైద్యులు ప్రీతి గుండె పోటుతో మరణించిందని చెబుతున్నారు. రిపోర్ట్ కూడా అదేవిధంగా వచ్చింది.
Advertisement
దాంతో ప్రస్తుతం ఈ కేసును సీరియస్ గా తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.ప్రీతి కేసులో జూనియర్ మెడికో ల వాంగ్మూలం కీలకంగా మారింది. జూనియర్ డాక్టర్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి కీలక విషాయలను వెల్లడించారు. ప్రీ అనస్థీషియా రిపోర్ట్ వివాదంలో సైఫ్ చెప్పిన రిపోర్ట్ కు భిన్నంగా జూనియర్ డాక్టర్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. పీఎసీ రిపోర్ట్ విషయంలో సైఫ్ ఫిజికల్ గా లేకపోయినా కూడా ప్రీతిని బ్లేమ్ చేసినట్టు తేలింది.
Advertisement
డాక్టర్ సైఫ్ తనను వేధిస్తున్నాడని..పీఎసీ రిపోర్ట్ విషయంలో తనకు సహకరించాలని ప్రీతి తన స్నేహితులను వేడుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా సైఫ్ వేధింపుల విషయంలో పోలీసులు సాంకేతిక ఎవిడెన్స్ లను సేకరించారని తెలుస్తోంది. కౌన్సిలింగ్ సమయంలో ప్రీతి కంటతడి పెట్టుకోవడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అంతే కాకుండా జీఎంహెచ్ లో సైఫ్ వ్యవహారం…అనస్థేషియా విభాగంలో హెచ్ ఓడీ తీరును అధికారులు ర్యాగింగ్ కోణంలో చూస్తున్నారు.
ALSO READ :టీ 20లో ఆల్ టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్ అతడే.. విరాట్ ని ఆశ్చర్యపరిచిన బెస్ట్ ఫ్రెండ్..!