Home » బర్త్‌ డే పార్టీకి వెళ్లి ఇద్దరు సాఫ్ట్‌వేర్ల దుర్మరణం

బర్త్‌ డే పార్టీకి వెళ్లి ఇద్దరు సాఫ్ట్‌వేర్ల దుర్మరణం

by Sravan Sunku
Ad

స్నేహితుని పుట్టిన రోజు పార్టీకి వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్నారు ఇద్ద‌రు యువ‌కులు. స‌ర‌దా స‌ర‌దాగా గ‌డిపిన వారు ఉన్న‌ట్టుండి రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం స‌మీపంలోని వీ క‌న్వెన్ష‌న్ హాల్ ఎదుట ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.

Advertisement

Advertisement

మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి గుర్తు తెలియ‌ని వాహ‌నం సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్లు వెళ్లుతున్న బైకును ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ది. ఈ ప్ర‌మాదంలో ధ‌న‌రాజ్ (22), కే.వినోద్‌ఖ‌న్నా(22) అక్క‌డిక్క‌డే మృతి చెందారు.
విశాఖ‌ప‌ట్ట‌ణంలో మారిక‌వ‌ల‌స‌లోని శార‌దాన‌గ‌ర్‌కు చెందిన ధ‌న‌రాజ్‌, స్వ‌తంత్ర‌న‌గ‌ర్‌కు చెందిన వినోద్ ఖ‌న్నా ఇద్ద‌రు క‌లిసి స్నేహితుని బ‌ర్త్ డే వేడుక‌ల‌కు వెళ్లారు. కొద్ది సేపు జాలీగా గ‌డిపారు. త‌రువాత బైకులో పెట్రోల్ పోయించుకుందాం అని కొమ్మాది పెట్రోల్ బంక్‌కు వెళ్లారు వీరిద్ద‌రు.

బైకులో పెట్రోల్ పోయించుకుని తిరిగి త‌న స్నేహితుని ఇంటివైపుకు వెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వ‌ద్ద‌కు చేరుకోగానే గుర్తు తెలియ‌ని వాహ‌నం బైకు ఢీ కొట్ట‌డంతో వారు అక్క‌డికక్క‌డే ప్రాణాలు విడిచారు. పీఎం పాలెం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. వారిరువురి కుటుంబ స‌భ్యులు రోధిస్తున్న తీరు అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తున్న‌ది.

Visitors Are Also Reading