Home » ఆర్తి అగర్వాల్ వల్ల ఆ ఇద్దరి హీరోయిన్స్ లైఫ్ నాశనం అయ్యిందా? అసలేమైంది?

ఆర్తి అగర్వాల్ వల్ల ఆ ఇద్దరి హీరోయిన్స్ లైఫ్ నాశనం అయ్యిందా? అసలేమైంది?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ టైం లో కోట్ల మంది తెలుగు అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్స్ లో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. విక్టరీ వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఆర్తి దాదాపు అందరు బడా హీరోల సరసన నటించారు. తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

Advertisement

 

ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను కొట్టేసారు. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైం లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచారు. ఆమె ఎంట్రీ తో అప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్న యంగ్ హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గాయట. ఆర్తి అగర్వాల్ రాక ముందు రీమా సేన్, అనిత అనే ఇద్దరు యంగ్ హీరోయిన్స్ ఫామ్ లోనే ఉన్నారు. ఈ ఇద్దరి హీరోయిన్స్ సినిమాలు హిట్ అయ్యి ఉండడంతో మంచి పేరు, అవకాశాలు వస్తున్నా తరుణంలోనే ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

అయితే.. ఆర్తి అగర్వాల్ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఆమెకు దాసోహం అన్నారు. ఆమెని వరుస అవకాశాలు వరించడంతో ఈ ఇద్దరి యంగ్ హీరోయిన్స్ కెరీర్ గల్లంతయ్యింది. ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన ఏడాది సమయానికే ఆర్తి అగర్వాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురిలోనూ యాక్టింగ్ టాలెంట్ బాగున్నప్పటికీ.. అనిత, రీమా సేన్ ల కంటే ఆర్తి అగర్వాల్ స్కిన్ టోన్, స్క్రీన్ ప్రెజెన్స్ తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించాయి. దీనితో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆమెకే అవకాశాలు ఇస్తూ ఉండేవారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading